E-Paper
Advertisement

Indiramma Housing: క్యూర్ ప‌రిధిలో మొద‌టి విడత ఇందిర‌మ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి!

Indiramma Housing: క్యూర్ ప‌రిధిలో మొద‌టి విడత ఇందిర‌మ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి!
Advertisement

Indiramma Housing: స్వేచ్ఛ బ్యూరో: హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మ‌ల్కాజిగిరి జిల్లాల్లో క్యూర్(కోర్ అర్బన్ రీజియ‌న్ ఎకాన‌మీ) ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నివ‌సించే పేద ప్రజ‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాల‌ను గుర్తించాల‌ని సూచించారు. హైదరాబాద్ స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, అజారుద్దీన్‌, పొన్నం ప్రభాక‌ర్‌ తో క‌లిసి క్యూర్‌ ఏరియాలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లపై సోమవారం స‌మీక్ష నిర్వహించారు. క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్లకు, అలాగే డ‌బుల్ బెడ్రూం ఇండ్లకు పార‌ద‌ర్శకంగా ల‌బ్ధిదారుల ఎంపిక ఉండాల‌ని, ఎలాంటి రాజ‌కీయ ఒత్తిళ్లకు త‌లొగ్గవద్దని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

నివాసం ఉండని ఇండ్లను..

డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది వాటిలో నివ‌సించ‌కుండా అద్దెకు ఇస్తున్నవారికి, ఏండ్ల త‌రబ‌డి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న వారికి నోటీసులు జారీ చేయాల‌ని ఆదేశించారు. నోటీసుల‌కు స్పందించ‌ని వారి ఇండ్లను రద్దు చేసి అర్హులైన పేద‌ల‌కు కేటాయించాల‌ని స్పష్​టంచేశారు. ఇప్పటి వ‌ర‌కు ఎంత‌మందికి నోటీసులు ఇచ్చారని, ఎంత‌మంది స్పందించారని, అక్కడ నివాసం ఉండ‌క‌పోవ‌డానికి వారు చెప్పిన కార‌ణాలేంటని మంత్రి ఆరా తీశారు. 2 బీహెచ్‌కే, జేఎన్ఆర్ఎం త‌దిత‌ర ప‌థకాల్లో ఇండ్లు పొంది నివాసం ఉండని ఇండ్లను మే 1వ తేదీ నుంచి ప‌రిశీలించాల‌ని, నోటీసులు ఇచ్చి, స్పందించకుంటే కేటాయింపులను రద్దు చేయాల‌ని స్పష్టం చేశారు. నోటీసుల‌పై స్పందించిన ల‌బ్ధిదారుల నుంచి బాండ్ పేప‌ర్ పై తాము ఇక్కడే నివాసం ఉంటామ‌ని, లేదంటే ర‌ద్దు చేసే అధికారం ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు వారి నుంచి హామీ పొందాల‌ని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రభుత్వ నిబంధ‌న‌ల‌కు ఆమోదం తెలిపేలా అండ‌ర్ టేకింగ్ తీసుకోవాల‌ని సూచించారు.

Advertisement

Also Read: MLA Committees: శాసనసభలో సరికొత్త వ్యూహం.. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు..?

అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్రూం ట‌వ‌ర్లు..

నాలుగు జిల్లాల ప‌రిధిలోగ‌ల కాల‌నీల్లో ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ వంటి క‌నీస వ‌స‌తుల‌ను త‌ప్పనిస‌రిగా క‌ల్పించాల‌ని, ఈ విష‌యంలో జీహెచ్ఎంసీ స‌హ‌కారాన్ని తీసుకోవాల‌ని సూచించారు. ముఖ్యంగా 22 వేల‌ ఇండ్లకు విద్యుత్ మీట‌ర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటుచేయాల‌ని మంత్రి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్రూం ట‌వ‌ర్లు మొత్తం పూర్తయ్యేవ‌ర‌కు ఆగ‌కుండా పూర్తయిన వాటిని ఎప్పటిక‌ప్పుడు ల‌బ్ధిదారుల‌కు కేటాయించాల‌న్నారు. అదేవిధంగా వివిధ కాల‌నీల్లో ఉన్న వాణిజ్య స‌ముదాయాల‌ను అద్దె ప్రాతిప‌ద‌క‌న కాకుండా వేలం ప‌ద్ధతిలో వాటిని విక్రయించాల‌ని, ఆవిధంగా వ‌చ్చిన డ‌బ్బును అక్కడి సొసైటీ, ప్రభుత్వం పేరిట జాయింట్ అకౌంట్ లో వేయాల‌న్నారు. అంతేగాక ప్రజా ప్రయోజ‌న కార్యాల‌యాల కోసం కూడా కొన్నింటిని కేటాయించాల‌ని తెలిపారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ కార్యద‌ర్శి, ఎండీ వీపీ గౌత‌మ్‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల క‌లెక్టర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Farmer Kits: రైతులకు శుభవార్త.. రాష్ట్రంలో నేడు ఫార్మర్ కిట్స్ పంపిణీ..!

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×