New RTC Depots: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా ఆర్టిసి బస్సు డిపోలు రాబోతున్నాయి. ప్రజల సౌకర్యార్థం బస్సుల సంఖ్య ప్రభుత్వం పెంచుతుంది. అందుకు అనుగుణంగా బస్ డిపోల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే స్థలాల గుర్తింపు అధికారులు చర్యలు చేపట్టారు. త్వరలోనే వాటిని ప్రారంభించిన సమాచారం.
ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌లో త్రిబుల్ ఆర్ లోపల డీజిల్ బస్సులు లేకుండా చర్యలు చేపడతామని ప్రకటించింది. పొల్యూషన్ పెరగకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తామని పేర్కొంది. 2000 ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. అయితే ఆ బస్సులను ప్రజలకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అందుకోసం త్రిబుల్ ఆర్ పరిధిలో నూతనంగా మరో 14 ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేయబోతుంది. అందులో నానక్ రామ్ గూడ, కోకాపేట, నార్సింగి, శంషాబాద్, కందుకూరు, కృష్ణాపూర్, కీసర, ఘట్కేసర్, షామీర్పేట, కుత్బుల్లాపూర్, మొయినాబాద్, అబ్దుల్లాపూర్మెట్, శంకర్పల్లి, ఫోర్త్ సిటీలో డిపోలను ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు.
Also Read: University Reforms: తెలంగాణలో మారనున్న యూనివర్సిటీల రూపురేఖలు.. ప్రభుత్వం ప్లాన్ ఇదే..?
డిపోలకు భూసేకరణ బాధ్యత స్థానిక అధికారులకు, కలెక్టర్కు అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి సైతం అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ బస్సు డిపోలలో చార్జింగ్ స్టేషన్లో సైతం ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఖర్చులు సైతం ప్రణాళికల రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ బస్సులను జేబీఎస్ అనే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో నిర్వహిస్తుంది. అదే తరహాలో ఈ రెండు వేల బస్సులను సైతం ఓ ప్రైవేట్ సంస్థకు నిర్వహించబోతున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయబోయే 14 ఆర్టీసీ బస్సు డిపోలకు.. ఈ రెండు వేల బస్సులను కేటాయించనున్నారు. ప్రజల సౌకర్యార్థం ఆయా రుట్లలో బస్సు సర్వీసు నడపనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫోర్త్ సిటీలో బస్సు డిపో ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సీఎం సూచనల మేరకు రవాణాశాఖ అధికారులు డిపో ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు.