Big Stories

Health Director : డాక్టర్ నోట తాయత్తు మాట.. వివాదంలో హెల్త్ డైరెక్టర్..

Health Director(Telangana News) : ఆయన తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఉబలాట పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు కోసం తాపత్రయ పడుతూ ఉంటారు. గతంలో ఒకసారి వేదికపై కేసీఆర్ కాళ్లు మొక్కే ప్రయత్నం చేసి విమర్శల పాలయ్యారు. విమర్శలు ఎదురైనా.. ఆ చర్యను సమర్థించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు పితృ సామానులని ఆయన పాదాలను తాకడం అదృష్టంగా భావిస్తున్నానంటూ ఆ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్న ఆ అధికారి.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.

- Advertisement -

తాజాగా కొత్తగూడెం ఇఫ్తార్‌ విందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానని వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఓ డాక్టర్ నోట నుంచి తాయత్తు మహిమ అనే మాటలు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

ఖమ్మం జిల్లాలోని ఓ తండాలో గతంలో శ్రీనివాసరావు వివాదాస్పదంగా పూజలు చేయడం కలకలం రేపింది. ఆయన క్షద్రపూజలు చేశారని ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది కొత్తగూడెం శ్రీనగర్‌ కాలనీ డీఎస్‌ఆర్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లోనూ శ్రీనివాసరావు తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో సినిమా పాటకు డ్యాన్స్‌ వేసి వివాదంలో చిక్కుకున్నారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్ లు వేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇలా నిత్యం ఏదో ఒక వివాదంలో శ్రీనివాసరావు చిక్కుకుంటున్నారు.

తెలంగాణ హెల్త్ డైరక్టర్ గా పెద్ద బాధ్యతలను నిర్వహిస్తున్న ఆయన తీరును సామాన్యులు తప్పుపడుతున్నారు. విమర్శలు వచ్చిన ప్రతిసారి .. తన చర్యలను సమర్థించుకుంటూ సమాధానం చెప్పడం ఆయన నైజం. మరి తాయత్తు మహిమ మాటలపై శ్రీనివాసరావు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News