E-Paper
Advertisement

నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Advertisement

Heatwave Alert: తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పై హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా 7 జిల్లాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఈ నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

‘ఒక్క ప్రాణం పోకూడదు’

మరోవైపు వచ్చే మూడు రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్ ఉండనున్నట్లు మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం అని పొంగులేటి స్పష్టం చేశారు. ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎండల తీవ్రతపై ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు జారీ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

‘ప్రజలెవరూ బయటకు రావొద్దు’

Advertisement

ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు.. ఈ ఎండలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయం, భవన నిర్మాణ కార్మికులు సైతం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హీట్ వేవ్ పై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. వడదెబ్బ కేసులను వెంటనే చికిత్స అందించేందుకు ఆస్పత్రులను సిద్దంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Also Read: బీఆర్ఎస్ అధికారంలోకి.. వచ్చేది లేదు సచ్చేది లేదు.. టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

వడదెబ్బకు మరో ఇద్దరు మృతి

Advertisement

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కాస్తున్న విపరీతమైన ఎండలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా హీట్ వేవ్ కారణంగా భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల్లో ఇద్దరు వృద్దులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా మంగపేట మండలం పూరేడిపల్లి గ్రామంలో సోమిరెడ్డి (60) అనే వృద్ధుడు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో పుష్కరాల కోసం వచ్చిన భక్తుడు వడదెబ్బతో చనిపోయినట్లు పేర్కొన్నారు. విపరీతమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత సపోర్ట్.. ప్రభుత్వానికి అల్టిమేటం.. చర్చలకు రాకుంటే!

Related News

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×