E-Paper
Advertisement

ఫీజుల వివాదం.. ప్రైవేట్ కాలేజీలకు హైకోర్టులో భారీ ఊరట

ఫీజుల వివాదం.. ప్రైవేట్ కాలేజీలకు హైకోర్టులో భారీ ఊరట
Advertisement

Telangana High Court: ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో ఊరట దక్కింది. విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చెయ్యొద్దని ప్రభుత్వం జారీ చేసిన జీవో 9లోని కొన్ని మార్గదర్శకాలపై న్యాయస్థానం వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యoతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు కొన్ని ప్రశ్నలను సంధించింది. మీరు బకాయిలు చెల్లించరు, విద్యార్ధుల నుంచి కళాశాలలను ఫీజులు వసూలు చేయవద్దంటే వాళ్లు కాలేజీలు ఎలా నడుపుతారని ప్రశ్నించింది.

ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. బడ్జెట్ సెషన్ కూడా అయిపోయినట్టు ఉందని, ఇంతవరకు బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదని నిలదీసింది. పెండింగ్ బకాయిలు ఎప్పటి లోగా చెల్లిస్తారో తెలపాలని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు15 లోపు బకాయిలు అన్ని క్లియర్ అవుతాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. ఆ లోపు బకాయిలు క్లియర్ అయితే ఆ రోజే మా పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు తెలిపాయి.

Advertisement

Also Read: నీటి సమస్యకు.. శాశ్వత పరిష్కారం కావాలి.. తుంగభద్ర వేదికగా సీఎం రేవంత్ డిమాండ్

మరోవైపు విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వానికి, కాలేజ్ యాజమాన్యాలకు మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ బకాయిల ద్వారా 2,3,4 సంవత్సరాల విద్యార్థులు నష్టపోకుండా చూడాలని కోరారు. ఈ ఏడాది కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకే ఇది వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 30వ తేదీకి వాయిదా పడింది.

Advertisement

Also Read: అవును.. నేను గుంపుమేస్త్రీనే..! సెల‌వు తీసుకోకుండా..తెలంగాణ కోసం శ్ర‌మిస్తున్నా!

Related News

తెలంగాణ రాష్ట్రంలో డేంజర్ బెల్స్.. పంజా విసురుతున్న విష జ్వరాలు

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. వచ్చేవారంలో TGPSE నోటిఫికేషన్లు, పుస్తకాలతో కుస్తీ మొదలు

చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు, అదే కారణమా?

తెలంగాణలో కొత్త స్కీమ్.. రూ. 1.50 లక్షల సబ్సిడీ, ఇంకెందుకు ఆలస్యం

జగన్ మాదిరిగా తాను కూడా.. షర్మిలతో నాకు పోలికేంటి? కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రాజెక్టు పూర్తిచేసే భాధ్యత నాదే.. హుస్నాబాద్ ప్రజలకు మంత్రి పొన్నం భరోసా!

మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!

హైదరాబాద్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రాడ్.. రూ. 10 కోట్ల ఆస్తులు స్కామ్‌ చేసిన కేటుగాడు!

Big Stories

Advertisement
×