KTR Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ముగియడంతో.. మంగళవారం నాడు మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో ప్రభుత్వం కేటీఆర్ నేతృత్వంలోనే విదేశానికి తప్పుడు విధాానాల్లో డబ్బును పంపించారని ఆరోపించగా.. తనకు పోలీసుల అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ కేటీఆర్ కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా.. వాటి కాలపరిమితి ముగియంతో మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో.. కేటీఆర్ కు తాత్కాలిక ఉపశమనం కలిగింది.
తనపై సీబీఐ నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. ఇందులో తీర్పును రిజర్వు చేసింది. కేసులో హైకోర్టు తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.