E-Paper
Advertisement

తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి

తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి
Advertisement

Hyderabad: ఓఆర్‌ఆర్‌ లోపల ఇళ్ల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త పథకానికి పేరు కోసం ప్రజల నుంచి సూచనలు తీసుకుంటోంది. మంచి పేరు సూచించిన వారికి లక్ష రూపాయులు బహుమతి ఇవ్వనుంది. ఈ విషయాన్ని హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ స్వయంగా వెల్లడించారు.

తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి

Advertisement

రాష్ట్రం ఏర్పడిన తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు-LIG క్యూర్ ఏరియాలో లక్ష ప్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి మంచి పేరు కోసం సూచించాలని హౌసింగ్ బోర్డు డిసైడ్ అయ్యింది. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకానికి మంచి పేరు నేరుగా ప్రజల నుంచి స్వీకరించాలని డిసైడ్ అయ్యింది.

వచ్చిన పేర్లలో ఉత్తమమైనది ఎంపిక చేయనున్నారు. మంచి పేరు సూచించిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇవ్వనుంది. సోషల్ మీడియా వేదికగా ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. వివిధ వర్గాల ప్రజల సొంతింటి కలలను నెరవేర్చడంలో హౌసింగ్ బోర్డుకు మంచి పేరు ఉంది.

Advertisement

క్యూర్ ఏరియాలో లక్ష ఫ్లాట్ల నిర్మాణానికి శ్రీకారం

బోర్డు ఆధ్వర్యంలో చేపట్టి ప్రాజెక్టుకు ప్రజల నుంచి మాంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో చాలాకాలం తర్వాత చేపడుతున్న ప్రాజెక్టు కావడంతో అందులో ప్రజలను భాగస్వామ్యులను చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూన్ 28 వరకు సోషల్‌మీడియా వేదికగా పోటీ జరుగుతోంది.

హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన tghd.official పేరుతో ఇన్‌స్టా‌గ్రామ్ www.instagram.com/p/DZ6mCF_E1PY/ ఉంది. దాని ద్వారా పోటీలో పాల్గొనవచ్చు. క్యూర్ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ ఐజి ప్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. అవసరమైన భూములను గుర్తించింది ప్రభుత్వం. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించనుంది. దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ALSO READ: తెలంగాణ సీపీఎం పార్టీలో మూడు ముక్కలాట.. తెరవెనుక ఉన్న ఆ కీలక నేత..?

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×