E-Paper
Advertisement

సీఎం గుడ్ న్యూస్.. ORR లోపలే ఇందిరమ్మ ఇళ్లు.. ఇక నగరం దాటి పోనక్కర్లేదు..!

సీఎం గుడ్ న్యూస్.. ORR లోపలే ఇందిరమ్మ ఇళ్లు.. ఇక నగరం దాటి పోనక్కర్లేదు..!
Advertisement

Indiramma Flats: తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ పరిధిలోనూ నిరుపేదలకు ఇళ్లు కట్టించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో పేదలకు ఆసరాగా నిలిచేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

పని ప్రదేశాలకు దగ్గర్లోనే ఇళ్లు

Advertisement

పేదలు తమ ఉపాధి అవకాశాలు కోల్పోకుండా ఉండాలంటే జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఊరికి దూరంగా ఇళ్లు కడితే ప్రజలకు ఉపాధి, రవాణా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు చెందిన ఖాళీ భూములను ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం వినియోగించాలని నిర్ణయించారు.

తొలి దశలో 7,680 ఫ్లాట్లు

Advertisement

హైదరాబాద్ పట్టణ ప్రాంతాల పరిధిలో తొలి దశగా 17 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాజేంద్రనగర్ నుంచి మలక్‌పేట్ వరకు ఉన్న 17 నియోజకవర్గాల్లో ఈ మొదటి విడత ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి ఫ్లాట్ మొత్తం 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనుండగా, అందులో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తుంది.

ఖర్చు వివరాలు, ప్రభుత్వ సబ్సిడీ

ఈ నిర్ణయంతో హైదరాబాద్ నగరంలో ఎప్పటినుంచో సొంతింటి కల కంటున్న వేలాది మంది పేద కుటుంబాల నిరీక్షణ త్వరలోనే ఫలించనుంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్కో ఇందిరమ్మ ఫ్లాట్ నిర్మాణానికి రూ. 11 లక్షలు వ్యయం అవుతుండగా, అందులో ప్రభుత్వమే రూ. 5 లక్షల సబ్సిడీని అందిస్తోంది. అంతేకాకుండా ఫ్లాట్ల నిర్మాణానికి అయ్యే భూమి ఖర్చును కూడా పూర్తి ఉచితంగా ప్రభుత్వమే భరిస్తుండటంతో, మిగిలిన రూ. 6 లక్షల వాటాను మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Also Read: ఏపీ ఓటర్ల జాబితాలో సంచలనం.. 44 లక్షల ఓట్లు గాయబ్? నేటి అర్ధరాత్రితో ‘సర్’ ప్రక్రియ క్లోజ్!

Related News

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

కాంట్రాక్టర్ యమ సేఫ్ ప్లాన్.. ఏసీబీకి చిక్కిన అధికారి.. ఎలా చిక్కారంటే..?

సునీల్ గవాస్కర్ నుంచి నేను నేర్చుకున్నది ఇదే.. అజహరుద్దీన్ సక్సెస్ మంత్ర!

గవర్నర్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బిగ్ అప్డేట్.. సూచనలు చేస్తానని హమీ!

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపిక కాలేదా? మీ డబ్బు ఇలా వాపస్

మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్

రేవంత్ vs కేసీఆర్.. సామాజిక స్పృహపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్

Big Stories

Advertisement
×