E-Paper
Advertisement

ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవ సర్టిఫికెట్లు ఇక మరింత పటిష్టం.. చినగవు, తడిచినా చెక్కుచెదరవు!

ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవ సర్టిఫికెట్లు ఇక మరింత పటిష్టం.. చినగవు, తడిచినా చెక్కుచెదరవు!
Advertisement

MeeSeva Certificate: ప్రభుత్వ ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవ సర్టిఫికెట్ పేపర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం ప్రజా భవన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు ఉపయోగించే సర్టిఫికెట్లు ప్రజల జీవితంలో ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. కొన్ని పత్రాలను జీవితాంతం భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుందన్నారు. అలాంటి ధ్రువపత్రాలు త్వరగా పాడవకుండా చూడటంతో పాటు వాటి విశ్వసనీయతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని మరింత పెంచే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కొత్త సెక్యూరిటీ పేపర్‌తో సర్టిఫికెట్ల మన్నిక పెరగడంతో పాటు నకిలీలను అరికట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రభుత్వ ధ్రువపత్రాలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

ఇదిలా ఉంటే కొత్త మీ సేవ సర్టిఫికెట్ పేపర్‌లో 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, అనధికార నకళ్లను అరికట్టేలా వీటిని రూపొందించారు. భద్రతా కారణాలతో ఈ ఫీచర్ల పూర్తి వివరాలను వెల్లడించడం లేదు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ పేపర్ సులభంగా చినిగిపోదు. నీళ్లు పడినా త్వరగా దెబ్బతినదు. సాధారణ వినియోగం, మడతపెట్టడం, ఎక్కువ కాలం భద్రపరచడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో సర్టిఫికెట్లను ఏళ్ల తరబడి మంచి స్థితిలో దాచుకునే అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో వాటికి లామినేషన్ చేయించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

Also Read: ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Advertisement

తెలంగాణలో మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అనేక రకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 2011 నుంచి మీ సేవ సర్టిఫికెట్ల ముద్రణకు ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పేపర్ స్థానంలో మరింత నాణ్యత, భద్రత, మన్నిక కలిగిన కొత్త పేపర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు దీర్ఘకాలం భద్రపరచాల్సిన ఇతర ప్రభుత్వ పత్రాలకు ఇది ఎంతో ఉపయోగపడనుందని మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘటించారు.

Also Read: భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

Tags

Related News

ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!

ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి.. ఫేక్ వీడియోలపై ఎంపీ చామల ఫైర్!

రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర.. జీవో 17 జారీ పై హరీష్ రావు ఫైర్!

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

తెలంగాణ ఉపాధి హామీ FTE ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా బోనస్ విడుదల!

పాత నోట్ల పేరుతో రూ.70 కోట్ల దందా.. AIని వాడి విచిత్ర మోసం!

సౌత్ అయినా.. నార్త్ అయినా సీఎం రేవంత్ వ్యూహం ఓక్కటే.. అటాక్ మోడీ!

Big Stories

Advertisement
×