E-Paper
Advertisement

రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర.. జీవో 17 జారీ పై హరీష్ రావు ఫైర్!

రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర.. జీవో 17 జారీ పై హరీష్ రావు ఫైర్!
Advertisement

Farmer DISCOM: రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవో17 జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేసిందని మండిపడ్డారు. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవో జారీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, దుర్మార్గ వైఖరికి నిదర్శనం అన్నారు. మంగళవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర?వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెరతీయడం సిగ్గుచేటన్నారు.

ప్రయోజనం ఏమిటి?

రైతు డిస్కమ్ ఏర్పాటు వల్ల రైతులకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ నిర్ణయం ఎలా దోహదపడుతుందో చెప్పకుండా మొండిగా వ్యవహరించడం దుర్మార్గం అని మండిపడ్డారు. సర్కార్ నిర్వాకంతో మరింత ఇబ్బందుల్లో అన్నదాత ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే దిక్కు లేదు.. రేపు రైతు డిస్కం తో మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి రైతు మెడకు రైతు డిస్కం ఉచ్చు ఉచిత విద్యుత్ పై చేతులెత్తేసేందుకే సర్కార్ కొత్త ఎత్తుగడ అని దుయ్యబట్టారు.

512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు..

Advertisement

​పంటలు ఎండి రైతు కన్నీరు పెడుతుంటే.. డిస్కంల పేరిట రేవంత్ సర్కార్ రాజకీయ చదరంగం ఆడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం కొత్త డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి , మిషన్ భగీరథ.. మొత్తంగా 30,62,853 కనెక్షన్లు రైతు డిస్కం కి బదిలీ చేసారు. ఇంత భారీ వ్యవస్థ నిర్వహణ కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా సాధ్యం అవుతుంది?కేవలం 25శాతం థర్మల్ పవర్ అలకేషన్ తో రైతులకు సాగు, ప్రజలకు తాగు నీళ్లకు అవసరం అయ్యే భారీ విద్యుత్ వ్యవస్థ ఎలా నడుస్తుంది?6,15,651 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, 2.51 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల వ్యవసాయ ఎల్‌టీ లైన్లు వీటి నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోతే రైతుల కష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?రాష్ట్ర విద్యుత్ కేటాయింపుల్లో ఇప్పటికీ 53.28 శాతం థర్మల్ విద్యుత్తే ఉంది.

Also read: భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!

చీకట్లోకి నెట్టబోతోందా?

Advertisement

సౌర విద్యుత్తు వాటా 35.31 శాతం మాత్రమేనని, ఇందులో థర్మల్ 25%, సోలార్ 58%, హైడల్ మొత్తంగా 100% రైతు డిస్కమ్ కు కేటాయించారని, పగటి పూట మాత్రమే సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే, రాత్రి పూట ఉండదని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పే ప్రభుత్వం.. పగటిపూట మాత్రమే విద్యుత్ ఇచ్చి, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టబోతోందా? 2325 ఎం డబ్ల్యూ హైడల్ (జల విద్యుత్) పవర్ మొత్తం రైతు డిస్కమ్‌కే కేటాయించారు. కానీ ఈ హైడల్ పవర్ సాంకేతికంగా ఏడాదిలో కేవలం 3-4 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని, అంటే మిగతా 8 నెలలు రైతు డిస్కమ్‌కి ఈ విద్యుత్ అందుబాటులో ఉండదు. అప్పుడు ఎలా నిర్వహిస్తారు?కొత్త డిస్కమ్‌కు భారీ రుణాలు, బకాయిలను కేటాయిస్తూ.. దాని ఆర్థిక స్థిరత్వంపై ప్రభుత్వం ఏం భరోసా ఇస్తోంది? ఈ అప్పుల భారం చివరకు రైతులపై పడేయాలని చూస్తున్నారా?రైతు డిస్కమ్ పేరుతో వ్యవసాయ విద్యుత్ బాధ్యతలను వేరుచేసి, రేపు నష్టాల సాకుతో రైతులపై ఆంక్షలు విధించే ప్రమాదం లేదా?

హామీ ఇవ్వగలదా?

రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, 24 గంటల సరఫరాలో ఎలాంటి కోతలు ఉండవని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వగలదా? రైతుల అనుమానాలను నివృత్తి చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లడం కుదరదు అని, కొత్త సంస్థ ఏర్పాటుతో అదనపు పరిపాలనా ఖర్చులు ఎంత? ఆ ఖర్చులను ఎవరు భరిస్తారు? ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదిలీపై పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం ఎందుకు చేయలేదు?రైతుల పేరుతో డిస్కమ్ ఏర్పాటు చేయడం గొప్ప కాదు.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ముఖ్యం.

రైతుల్లో అనుమానాలు..

సంస్థల పేర్లు మార్చడం, కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం కాదు.. రైతుల విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపాలి. రైతుల ప్రయోజనాలే లక్ష్యమైతే వారి అభ్యంతరాలను పక్కనపెట్టి ఎందుకు ముందుకెళ్తున్నారు? ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పకుండా చాటు మాటుగా జీవో జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి?రైతులకు భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల్లో అనుమానాలు, ఆందోళనలు ఎందుకు పెంచుతోందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. రైతు డిస్కమ్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆర్థిక భారం, సిబ్బంది నిర్వహణపై పూర్తి వివరాలు వెల్లడించాలి. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లకూడదన్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటు వెనుక రైతుల ప్రయోజనాలే లక్ష్యమైతే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. లేదంటే తక్షణం జీవో ఉపసంహరించుకోవాలి అని యావత్ రైతాంగం పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

Also read: అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

Tags

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×