E-Paper
Advertisement

Healthcare Jobs: నెలకు రూ 3 లక్షల జీతం.. జర్మనీ, కువైట్‌లో తెలంగాణ నర్సులకు బంపర్ డిమాండ్!

Healthcare Jobs: నెలకు రూ 3 లక్షల జీతం.. జర్మనీ, కువైట్‌లో తెలంగాణ నర్సులకు బంపర్ డిమాండ్!
Advertisement

Healthcare Jobs: స్వేచ్చ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగానికి డిమాండ్ భారీగా ఉన్నది. ముఖ్యంగా విదేశాల్లో నైపుణ్యం కలిగిన (స్కిల్డ్) హెల్త్‌కేర్ స్టాఫ్‌కు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్ రంగం వైపే చూసిన యూత్ ,ఇప్పుడు గ్లోబల్ హెల్త్ సెక్టార్ వైపు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని టామ్ కామ్ ప్రత్యేక చొరవ తీసుకొని నిరుద్యోగులకు విదేశాల్లో ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నది.

టామ్ కమ్ గణాంకాలు..

గడిచిన మూడేళ్లుగా తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా అభ్యర్థులు విదేశాల్లో వివిధ రంగాల్లో కొలువులు సాధించినట్లు టామ్ కమ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇందులో 50 శాతం మంది హెల్త్ సెక్టార్ లోనే జాబ్స్ పొందారు. తెలంగాణకు చెందిన యువత సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాల ద్వారా విదేశాల్లో కొలువులు సాధించినట్లు టామ్ కమ్ చెబుతున్నది.

కువైట్‌కు భారీగా షిఫ్ట్.. జర్మనీలో నర్సింగ్ క్రేజ్..

Advertisement

​ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ పరిశీలిస్తే,మన హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా కువైట్ , జర్మనీ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు.గల్ఫ్ దేశాల్లో, ముఖ్యంగా కువైట్‌లో నర్సింగ్ ప్రొఫెషనల్స్ ,పారామెడికల్ సిబ్బందికి అత్యుత్తమ జీతభత్యాలతో కూడిన ప్రభుత్వ,ప్రైవేటు రిక్రూట్‌మెంట్లు జరుగుతుండటంతో మన వాళ్లు ఎక్కువగా అక్కడికే షిఫ్ట్ అవుతున్నారు.ఇర జర్మనీలో నర్సింగ్ ప్రొఫెషన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. జర్మనీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ‘ట్రిపుల్ విన్’ఒప్పందంలో భాగంగా టామ్ కామ్ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. జర్మన్ భాష (బీ1, బీ2 లెవెల్) నేర్చుకున్న అభ్యర్థులకు నెలకు రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు జీతంతో పాటు ఉచిత వీసా,విమాన టిక్కెట్లు లభిస్తుండటంతో ఇక్కడి నర్సులకు జర్మనీ హాట్ ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారింది.

Also read: ఎట్టకేలకు యుద్ధం ముగిసింది.. ఇరాన్-అమెరికా మధ్య డీల్, ట్రంప్ కీలక ప్రకటన, జలసంధి ఓపెన్

ఆస్‌బిల్డుంగ్’ప్రోగ్రామ్ ద్వారా..

Advertisement

అనుభవం లేని యువత కోసం ‘ఆస్‌బిల్డుంగ్’ప్రోగ్రామ్ ద్వారా ఉచిత శిక్షణ, స్టైపండ్‌తో కూడిన డిప్లొమా అవకాశాలూ అందుబాటులోకి వచ్చాయి. కువైట్ లో ల్యాబ్ టెక్నిషియన్లకు దాదాపు రూ.1.5 లక్షలు నుంచి 2.5 లక్షల వరకు ప్యాకేజీ ఉన్నది. యూకేaఓ హెల్త్ నర్సింగ్, మిడ్ వైవ్స్ కు రూ.2.5 లక్షల నుంచి 3.5 లక్షలు, డాక్టర్లకు కోటికి పైగా ప్యాకేజీలు ఉన్నాయి. స్థానికంగా 3 నెలల ఫౌండేషన్ కొర్సు ఉంటుంది. ఇక జపాన్ లో నర్సింగ్ స్టాఫ్​ కు రూ. 14 లక్షల నుంచి రూ.16 లక్షలు ఏడాదికి ఉంటుంది. ఐదేళ్ల వర్క్ పర్మిట్, జపనీస్ లాంగ్వేజ్ సపోర్టు వంటివన్నీ ఉండేలా టామ్ కమ్ సమన్వయం చేయనున్నది.

టామ్ కామ్ ఆధ్వర్యంలో వేగవంతమైన నియామకాలు

​గతంలో విదేశీ ఉద్యోగాల పేరిట మధ్యవర్తులు,నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులను మోసం చేసే పరిస్థితి ఉండేది.కానీ,ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్ కామ్ రంగంలోకి దిగాక సీన్ పూర్తిగా మారిపోయింది.విదేశీ నియామక సంస్థలు, ప్రభుత్వాలతో నేరుగా టైఅప్ పెట్టుకుంటూ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను టామ్ కామ్ విపరీతంగా వేగవంతం చేసింది.అంతేగాక జర్మనీకి జర్మన్, బ్రిటన్‌కు ఓఈటీ, ఐఈటీఎల్ టీఎస్ ,జపాన్‌కు జపనీస్ భాషల్లో హైదరాబాద్ క్యాంపస్ వేదికగా అభ్యర్థులకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తున్నారు.కేవలం కువైట్, జర్మనీలే కాకుండా యూకే ,యూఏఈ, సౌదీ అరేబియా, జపాన్ వంటి దేశాల్లోని టాప్ హాస్పిటల్స్ కోసం టామ్ కామ్ నిరంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఈ డిమాండ్‌కు కారణాలేంటి?

ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, దానికి తగ్గట్టుగా స్థానిక హెల్త్‌కేర్ స్టాఫ్ లేకపోవడం మన దేశ నిపుణులకు వరంగా మారింది.క్లినికల్ నాలెడ్జ్, రోగుల పట్ల చూపే ఆదరణ, కష్టపడే తత్వంలో తెలంగాణ నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది.దీంతోనే డిమాండ్ భారీగా ఉన్నది. దీనిలో భాగంగానే నిరుద్యోగులకు అండగా ఉండేందుకు టామ్ కమ్ బాధ్యత తీసుకుని వీసాలు, ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తుండటంతో అభ్యర్థుల్లోనూ, వారి కుటుంబాల్లోనూ భద్రతాభావం పెరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహం, టామ్ కామ్ నెట్‌వర్కింగ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వైద్య రంగంలో మన తెలంగాణ నర్సింగ్ ప్రొఫెషనల్స్ మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయం అంటూ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

Also Read: Rashi Singh : చీరలో వయ్యారాలు వలకబోస్తున్న రాశి సింగ్.. చూపుతిప్పుకోవడం కష్టమే..

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×