E-Paper
Advertisement

Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు

Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు
Advertisement

Telangana Maoists: శివధర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసు శాఖ అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులకు మరోసారి శాంతి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో శాంతి, భద్రతలు బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా అడవుల్లో, సరిహద్దు ప్రాంతాల్లో గుప్తచర్యల్లో కొనసాగుతున్న క్యాడర్లు వెంటనే లొంగిపోయి సాధారణ జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన శాంతి సందేశాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ.. హింసా మార్గం సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు.

గత రెండు సంవత్సరాల్లో మొత్తం 588 మంది మావోయిస్టులు లొంగుబాటు చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. లొంగుబాటు లేదా పునరావాస విధానం ద్వారా వారికి తక్షణ ఆర్థిక సాయం.. నివాస సదుపాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు కూడా తెలంగాణలో లొంగుబాటు చేసి సాధారణ జీవితాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఇదే మార్గాన్ని అనుసరించాలని ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్న 15 మంది తెలంగాణ మావోయిస్టు క్యాడర్లకు డీజీపీ ప్రత్యేక పిలుపునిచ్చారు.

Advertisement

లొంగిపోతే ప్రభుత్వం అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తూ.. కుటుంబాలతో గౌరవప్రదమైన జీవితం గడపడానికి సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సమాజంలో స్వేచ్ఛతో, గౌరవంతో జీవించేందుకు అవసరమైన పునరావాస చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి, అభివృద్ధి, సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని.. అండర్‌గ్రౌండ్ జీవితం విడిచి కుటుంబాలతో కలసి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని తెలంగాణ పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

Also Read:  ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

Advertisement

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×