Telangana RTC: కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ‘రెట్రో ఫిట్మెంట్ సాంకేతికతపై సంస్థ దృష్టి సారించింది. గతేడాది సెప్టెంబర్ 15న ‘రెట్రో ఫిట్మెంట్’ కోసం టెండర్లు పిలువగా అదే నెల 30న టెండర్ ప్రక్రియ ముగిసింది. సాయి గ్రీన్ మొబిలిటీ సంస్థకు 200, కల్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్ కు 40 బస్సు లను ‘రెట్రో ఫిట్మెంట్’ చేసే బాధ్యతను ఆర్టీసీ అప్పగించింది. 2027 నాటికి హైదరాబాద్ ఓఆర్ ఆర్ లోపల 2800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.
Also Read: Khammam: ఖమ్మం రెసోనెన్స్ స్కూల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి.. భగ్గుమన్న తల్లిదండ్రులు
వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ప్రజా రవాణా పెరగడంతో కాలుష్యం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని ఆరు డిపోల పరిధిలో 325 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, ఈ ఏడాదిలో మరో 175 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే బస్సుల కోసం అదనంగా 19 డిపోలలో చార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా 10 డిపోలు, 10 చార్జింగ్ కేంద్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ. 392 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2023లోనే ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక డీజిల్ బస్సును ప్రైవేటు సంస్థ సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారు. ప్రస్తుతం ఈ బస్సు ఉప్పల్ డిపో పరిధిలో విజయవంతంఅయింది.
హైదరాబాద్ భవిష్యత్తు కోసం తీసుకొస్తున్న ఈ హరిత ప్రయాణాన్ని ప్రజలంతా ఆదరించాలి. నగర ప్రజా రవాణా రూపురేఖలను మార్చే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు, కాలుష్యరహిత రవాణా సేవలు అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ ఆదేశాలతో తీసుకొస్తున్నాం.
Also Read: Road Accident: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు..!