E-Paper

దేవుడి భూముల కబ్జాదారులకు ఇక దబిడి దిబిడే.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్..?

దేవుడి భూముల కబ్జాదారులకు ఇక దబిడి దిబిడే.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్..?
Advertisement

Temple Lands: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో ఏళ్ల తరబడి నానుతున్న దేవాదాయ, ధర్మాదాయ శాఖల పరిధిలోని భూములకు సంబంధించిన వివాదాలు, ఆక్రమణల కేసుల పరిష్కారానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. దేవాదాయ ట్రిబ్యూనల్‌ను పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ట్రిబ్యూనల్‌కు మరో అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) ను నియమించేందుకు దేవాదాయ శాఖ ముమ్మర కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా, ఉన్నతాధికారులు నియామకానికి కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

ట్రిబ్యూనల్ లో ప్రస్తుతం ఇద్దరే..

ప్రస్తుతం ఎండోమెంట్ ట్రిబ్యూనల్‌లో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే సేవలందిస్తున్నారు. వీరిలో ఒకరు జ్యుడీషియల్ సభ్యుడిగా జడ్జి కాగా, మరొకరు అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడిగా అసిస్టెంట్ కమిషనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించిన వివాదాలు, లీజుల అక్రమాలు, ఆక్రమణలపై వస్తున్న కేసులను ఈ ఇద్దరే విచారించాల్సి వస్తోంది. ఫలితంగా కేసుల విచారణ నత్తనడకన సాగుతోంది. అంతేకాదు అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ విబేధాలు వస్తుండటంతో కేసులు పెండింగ్ లో పడుతున్నట్లు సమాచారం.

పరిష్కారానికి నోచని కేసులు

Advertisement

దేవుడి భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడేందుకు, వివాదాలను త్వరితగతిన తేల్చేందుకు ఏర్పాటైన ఈ ట్రిబ్యూనల్‌లో ఆశించిన స్థాయిలో కేసులు కొలిక్కి రావడం లేదని సమాచారం. లీజు నిబంధనల ఉల్లంఘన, నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు, సొంత ఆస్తులుగా చలామణి చేయడం వంటి వందలాది కేసులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలు, నివేదికల సమర్పణలో అసిస్టెంట్ కమిషనర్‌పై ఒత్తిడి పెరుగుతుండటంతో విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదని సమాచారం. ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడటమే కాకుండా, విలువైన దేవాదాయ భూములు కోర్టు కేసుల పరిధిలోనే చిక్కుకుపోతున్నాయి.

Also read: ఒరేయ్ గంభీర్..నీకు అస‌లు బుర్ర ఉందా? గిల్ ను ఓపెన‌ర్ గా ఎందుకు పంప‌లేదు

వెయ్యికిపైగా కేసులు..

Advertisement

తెలంగాణలో ఆలయాలకు 87235.39ఎకరాలను కేటాయించినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ భూములపై కొరవడటంతో ఆ భూముల ఆక్రమణకు గురవుతున్నాయి. ఆలయాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఎకరం కాదు.. రెండెకరాలు కాదు… ఏకంగా 20124.03 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. విత్ అవుట్ లిటిగేషన్ తో మరో 5569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం చూపడం లేదు. మరో 6 ఎకరాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే భూములు ఆక్రమణకు పాల్పడిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 కేసులుపెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.

ముగ్గురు ఉంటేనే కొలిక్కి..!

నిబంధనల ప్రకారం ట్రిబ్యూనల్‌లో ముగ్గురు కీలక అధికారులు ఉంటేనే కేసుల విచారణ ప్రక్రియ వేగవంతం అవుతుందని శాఖ అధికారులే అభిప్రాయపడుతున్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించాలన్నా, ప్రభుత్వ భూములను కాపాడాలన్నా తక్షణమే మరో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి అవసరమని దేవాదాయ శాఖ గుర్తించింది. ముగ్గురు సభ్యుల పూర్తిస్థాయి బెంచ్ అందుబాటులోకి వస్తే.. క్షేత్రస్థాయి పరిశీలనలు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రోజువారీ విచారణలు వేగంగా జరిగి, ఏళ్ల నాటి వివాదాలు త్వరగా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కేసులో ఇద్దరు అభిప్రాయం ఒకటే ఉంటే ఆ కేసుకు సత్వరపరిష్కారం లభించనుంది.

సర్కార్ గ్రీన్ సిగ్నల్?

ట్రిబ్యూనల్‌కు అదనపు అసిస్టెంట్ కమిషనర్‌ను కేటాయించాలంటూ దేవాదాయ శాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. విలువైన దేవాదాయ భూములను అక్రమార్కుల బారి నుంచి కాపాడటమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిర్ణయానికి ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చినట్లు సమాచారం. అర్హత, సీనియారిటీ ఉన్న అధికారిని ఎంపిక చేసే ప్రక్రియకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నియామకం పూర్తయితే, ట్రిబ్యూనల్ వేగం అందుకోవడమే కాకుండా.. వేల కోట్ల విలువైన ఆలయ భూముల పరిరక్షణకు మార్గం సుగమం కానుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also read: PSARA License: లైసెన్స్ లేకపోతే సెక్యూరిటీ ఆఫీసులు బంద్.. పోలీసుల సరికొత్త రూల్స్!

Related News

తెలంగాణ రైతులకు బంపరాఫర్.. బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి

NEET Students: నీట్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్!

Surplus Rice: సీక్రెట్ డీల్స్ లేవు.. మిగులు బియ్యం వివాదంపై తెలంగాణ సర్కార్ క్లారిటీ!

PSARA License: లైసెన్స్ లేకపోతే సెక్యూరిటీ ఆఫీసులు బంద్.. పోలీసుల సరికొత్త రూల్స్!

Digital Cabinet: తెలంగాణ క్యాబినెట్‌లో సరికొత్త హిస్టరీ.. అంతా ఆన్‌లైన్ మయం చేసిన సీఎం..!

Private School: ప్రభుత్వ నిభందనలకు తూట్లు.. అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహణ..!

వరంగల్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్.. నేటి పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!

×