E-Paper
Advertisement

క్రేజీ న్యూస్ మామ.. ఇక 4 వీల్ ఎలక్ట్రిక్ స్కూటర్లూ వచ్చేస్తున్నాయ్, లుక్ అదుర్స్ అంతే!

క్రేజీ న్యూస్ మామ.. ఇక 4 వీల్ ఎలక్ట్రిక్ స్కూటర్లూ వచ్చేస్తున్నాయ్, లుక్ అదుర్స్ అంతే!
Advertisement

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో కొత్త కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ కంపెనీలతో పాటు చిన్న బ్రాండ్లు కూడా ప్రత్యేకమైన డిజైన్లు, క్రేజీ ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. అలాంటి సంస్థల్లో PEV ఒకటి. ఈ కంపెనీ తాజాగా నాలుగు చక్రాలతో కూడిన ప్రత్యేక ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది.

4 చక్రాలతో క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు

Advertisement

సాధారణంగా స్కూటర్ అంటే రెండు చక్రాలు ఉంటాయి. కానీ, PEV అందిస్తున్న హైరైడర్, గ్రాండ్ హైరైడర్ మోడళ్లు నాలుగు చక్రాలతో వస్తున్నాయి. సాధారణ స్కూటర్ల కంటే భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, నడవడంలో ఇబ్బంది ఉన్నవారు, శారీరక వైకల్యాలు ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాలను రూపొందించినట్లు తెలుస్తోంది.

డిజైన్ ఎలా ఉందంటే?

హైరైడర్ మోడల్ సింగిల్ సీటర్‌ గా అందుబాటులో ఉంది. ఒక వ్యక్తి మాత్రమే కూర్చునేలా దీనిని డిజైన్ చేశారు. రోజువారీ చిన్న ప్రయాణాలు, షాపింగ్, కాలనీల్లో తిరగడానికి ఇది అనువుగా ఉంటుంది. మరోవైపు గ్రాండ్ హైరైడర్ మోడల్‌ లో ఇద్దరు కూర్చునే సదుపాయం ఉంది. రైడర్‌ తో పాటు మరో వ్యక్తి కూడా సౌకర్యంగా ప్రయాణించవచ్చు. డిజైన్ పరంగా చూస్తే ఈ స్కూటర్లు చిన్న క్వాడ్ బైక్‌ ల మాదిరిగా కనిపిస్తాయి. ముందు భాగంలో చక్కటి స్టైలింగ్‌ తో పాటు మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్ అందించారు. డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ స్టార్ట్, సెంట్రల్ లాకింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

అంతేకాకుండా, సీటు కింద స్టోరేజ్, మెటల్ బాస్కెట్, రివర్స్ గేర్, హ్యాండ్ బ్రేక్ లాంటి ఉపయోగకరమైన సదుపాయాలు కూడా లభిస్తాయి. రైడర్‌ కు ఇరువైపులా ఆర్మ్ రెస్ట్‌ లు ఇవ్వడం వల్ల ఎక్కువ సేపు ప్రయాణించినా సౌకర్యంగా ఉంటుంది. గ్రాండ్ హైరైడర్ మోడల్‌ లో వీల్‌ బేస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇది మరింత స్టేబుల్ గా కనిపిస్తుంది. వెనుక భాగంలో అడిషనల్ స్టోరేజ్ బాక్స్ కూడా అందించారు. అలాగే సీట్లను అవసరానికి అనుగుణంగా ముందుకు, వెనక్కి సర్దుకునే అవకాశం ఉంది.

60 కి.మీ ప్రయాణం.. 25 కి.మీ వేగం..

ఈ స్కూటర్లకు సంబంధించిన బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, టార్క్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే, ఇవి తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలుగా గుర్తింపు పొందాయి. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అందువల్ల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా కొన్ని వర్గాల వినియోగదారులు వీటిని ఉపయోగించవచ్చు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని తెలుస్తోంది. గరాల్లో చిన్న దూరాల ప్రయాణాలకు ఇది సరిపోతుంది.

ధర ఎంత అంటే?

ధర విషయానికి వస్తే, హైరైడర్ మోడల్ ధర సుమారు రూ.1.16 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గ్రాండ్ హైరైడర్ ధర రూ.1.31 లక్షల నుంచి మొదలవుతుంది.

Read Also: E20 ఫ్యూయల్ తో ఇంజిన్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా? పాత కారు ఓనర్లకు కొత్త టెన్షన్!

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×