Iran Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం బాంబు దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దేశంలోని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అక్క బెన్ గురియన్, అబ్బా హెల్లెల్ వంటి అండర్ గ్రౌండ్ స్టేషన్‌లలో తెలంగాణ వాసులు ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం వారికి అండర్ గ్రౌండ్ స్టేషన్లే సురక్షితమైన ప్రాంతంగా మారాయి. జూన్ 13 నుంచి ఈ స్టేషన్లలోనే తెలంగాణ కూలీలు, యువత ఆశ్రయం పొందుతున్నారు.
ప్రారంభంలో దాదాపు 200 మంది కార్మికులు ఓ పెద్ద షెల్టర్ ఉన్న బిల్డింగులో తలదాచుకున్నారు. కానీ బాంబు దాడులు ఎక్కువగా జరుగుతుండడంతో.. ఇజ్రాయెల్ గవర్నమెంట్ అండర్ గ్రౌండ్ స్టేషన్లు సురక్షిత ప్రాంతంగా గుర్తించింది. అప్పటినుంచి తెలంగాణ కార్మికులు, స్టూడెంట్స్ ఇందులో గడుపుతున్నారు.
ఇది అత్యంత సురక్షితమైన ప్రదేశం. తెలంగాణ నుంచి చాలా మంది కార్మికులం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. స్థానికంగా ఉన్న ఇజ్రాయెలీలు కూడా ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్‌లలో క్షేమంగా ఉన్నారు. పాత ఇళ్లల్లో ఉన్న స్థానిక ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ఉంటున్నారు’ అని తెలంగాణ ప్రజలు తెలిపారు.
గత ఏడాది అక్టోబర్‌లో హమాస్ దాడి జరిగిన తర్వాత నిర్మల్ జిల్లాకు చెందిన సారంగధర్ అనే వ్యక్తి భారత్‌కు తిరిగి వచ్చాడు. అతను ఓ తిరిగి మళ్లీ డిసెంబర్ నెలలో ఇజ్రాయెల్‌కు వెళ్లాడు. అయితే ప్రస్తుతం ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఐదు రోజుల నుంచి మాకు నిద్ర పట్టడం లేదు. మేం క్షేమంగా ఉన్నప్పటికీ.. ఏదో తెలయని భయం నెలకొంది. మేం ఇంకా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సారంగ్ ధర్ అక్కడ హౌస్ కీపింగ్ పని చేస్తున్నాడు.
ALSO READ: ఇరాన్- ఇజ్రాయెల్ వార్.. రంగంలోకి అమెరికా
ఇజ్రాయెల్‌లో అండర్ గ్రౌండ్ స్టేషన్లలో వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇకడ స్నిఫర్ డాగ్‌లత భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారని ఓ తెలంగాణ కార్మికుడు తెలిపాడు. ‘నిన్న రాత్రి రెండు సార్లు సైరన్లు విన్నాం. ఇవాళ ఇక్కడ కొన్ని బస్సులు తిరుగుతున్నారు. కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేశారు. కొంత మంది పనికి కూడా వెళ్లారు. నేను కూడా రేపటి నుంచి పనికి వెళ్తా’ అని మంచిర్యాల జిల్లాకు చెందిన గంగాధరి రమేష్ అన్నాడు.
ALSO READ: ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు