Balakrishna: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ఒకప్పుడు కేవలం సినిమాలు మాత్రమే చేసేవారు కానీ, ప్రస్తుతం ఈయన యాంకర్ గా కూడా మారిపోయారు. అదేవిధంగా ఈయన సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఒక బ్రాండ్ కూడా ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు కానీ, ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బాలయ్య తన బ్రాండ్ అయిన మ్యాన్షన్ హౌస్ (Mansion House)కు బ్రాండ్ అంబాసిడర్ గా కమిట్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్యకు మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ మాత్రమే తాగుతారని గతంలో తన చిన్నల్లుడు భరత్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
మ్యాన్షన్ హౌస్ ….
మామయ్య ఎక్కడికి వెళ్లినా తనతో పాటు ఒక బ్యాగ్ ఉంటుందని ఆ బ్యాగ్ మాత్రం ఆయన ఎవరికీ ఇవ్వరు, అందులో తన బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ ఉంటుందని తెలిపారు. అయితే తన ఫేవరెట్ బ్రాండ్ కే ఇప్పుడు బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. అయితే మ్యాన్షన్ హౌస్ ఆల్కహాల్ కి కాకుండా డ్రింకింగ్ వాటర్(Drinking Water) ను బాలయ్య ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఈ ప్రమోషన్ యాడ్ కి సంబంధించిన టీజర్ విడుదల చేయగా తాజాగా మరొక వీడియోని విడుదల చేశారు. ఇందులో బాలయ్య అద్భుతమైన డైలాగులతో అదర కొట్టారు.
అన్నింటినీ లవ్ చేయండి…
దట్టమైన అడవిలో ఒక వ్యక్తి సింహాన్ని షూట్ చేయబోతున్న నేపథ్యంలో ఆ సింహంపై సవారి చేస్తూ వచ్చే బాలయ్య ఎంట్రీ అద్భుతంగా ఉంది. అన్నింటినీ లవ్ చెయ్… లయన్ హార్ట్ తో వెల్కమ్ చెయ్యి అని చెప్పగానే ఆ వ్యక్తి తన గన్ పక్కన పడేస్తారు. జిందగీలో ఏదైనా దిల్ ఓపెన్ చెయ్… లైఫ్ వెల్కమ్ చెయ్..మ్యాన్షన్ హౌస్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటూ బాలకృష్ణ తనదైన శైలిలోనే డైలాగులు చెప్పారు.ఇలా అన్నింటినీ లవ్ చేయండి అంటూ పరోక్షంగా ఆల్కహాల్ ని కూడా లవ్ చేయండని చెప్పకనే చెబుతూ బాలయ్య అభిమానులకు ఒక గొప్ప సందేశం ఇచ్చారనే చెప్పాలి.
#NBK For Mansion House!pic.twitter.com/nbxTl0uXci
— Gulte (@GulteOfficial) May 30, 2025
ఇటీవల డాకు మహారాజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం ఈయన బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఇదివరకే వచ్చిన అఖండ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ సినిమాగా రాబోతున్న అఖండ 2 పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇలా బాలయ్య ఒకవైపు సినిమాలు మరోవైపు ప్రమోషనల్ వీడియోలు, రాజకీయాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు.