E-Paper
Advertisement

RTC Elections: ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

RTC Elections: ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
Advertisement

RTC Elections: టీజీఎస్ ఆర్టీసీ లో యూనియన్ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు, అనుమానాలకు తెరదించుతూ యాజమాన్యం ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేస్తోంది. యూనియన్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అడుగులు వేగవంతం చేసింది.

ఎన్నికల ప్రక్రియ..

​ఎన్నికల నిర్వహణ అధికారిగా ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమీషనర్ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.​ ఈ భేటీ నేపథ్యంలో యూనియన్ వేరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ బూత్‌ల వివరాలు, బూత్ ఇన్‌ఛార్జ్‌ల జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ అధికారికి (జాయింట్ లేబర్ కమీషనర్‌కు) అందజేసింది.

Advertisement

Also read: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో రూ.2 వేల కోట్లు రిలీజ్.. ఆర్థికశాఖ ఉత్తర్వులు

​రెండు, మూడు రోజుల్లో తొలి నోటీసు..

ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మరో రెండు, మూడు రోజుల్లో ‘ఫస్ట్ నోటీస్’ ఇచ్చేందుకు ఎన్నికల నిర్వహణ అధికారి ( జాయింట్ లేబర్ కమీషనర్) ఏర్పాట్లు చేస్తున్నారు.​ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా, పారదర్శకంగా ముగిసేలా ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం ఎన్నికల అధికారితో చర్చిస్తూ, సమన్వయం చేసుకుంటోంది.

36000 ఆర్టీసీ కార్మికులకు..

Advertisement

చివరిసారిగా ఆర్టీసీలో తేదీ 19-07-2016 న ట్రేడ్ యూనియన్ ఎన్నిక జరిగింది. తెలంగాణా మజ్దూర్ యూనియన్ 10 రీజియన్ లలో, 3 నాన్ ఆపరేషన్ యూనిట్లలో మరియు ఖమ్మం రీజియన్ లో మాత్రం ఎస్ డబ్ల్యూ ఎఫ్ (SWF)గెలిచింది. ప్రస్తుతం సుమారు 36000 ఆర్టీసీ కార్మికులకు ఓటు హక్కు ఉంది. ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విస్తృత చర్చ జరుగుతుంది.

Also read: Illegal Sand: గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం.. యువకుడికి ప్రాణహాని బెదిరింపులు..!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణ విద్యుత్ రంగంలో ఊహించని ట్విస్ట్!

రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టండి.. లేదంటే ప్రజా ఉద్యమమే.. రఘునందన్ రావు వార్నింగ్!

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ బిగ్ ప్లాన్..!

శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫేక్ పత్రాలతో భూముల ఆక్రమణ కలకలం

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్.. తమిళనాడు మాదిరి మార్పు ఎక్కడ?

తెలంగాణలో ‘సర్’ టెన్షన్.. 21 శాతం ఓట్లు పోయే ఛాన్స్, నేతలకు సీఎం రేవంత్ కీలక సూచనలు

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఎన్ని భద్రతలు తెలుసా? హోలోగ్రామ్‌ నుంచి మొదలు

వాళ్లు క్షుద్ర పూజలు చేశారు.. కానీ దేవుడు మన వైపే ఉన్నాడు! కూకట్‌పల్లిలో రేవంత్ సంచలనం!

Big Stories

Advertisement
×