E-Paper
Advertisement

జూలై 10న ఎన్నికల పోలింగ్.. రంగంలోకి దిగిన ఆఫీసర్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

జూలై 10న ఎన్నికల పోలింగ్.. రంగంలోకి దిగిన ఆఫీసర్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Advertisement

Handloom Elections: జూలై 10వ తేదీన జోగిపేట చేనేత సంఘానికి పోలింగ్‌ నిర్వహించేందుకు షెడ్యూలును చేనేత జౌళిశాఖ అధికారి విజారత్‌ అలీ విడుదల చేసారు. సోమవారం జోగిపేటలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో తాజా మాజీ చైర్మన్, కార్మికుల సమక్షంలో జిల్లా సోసైటీ కార్యాలయ అధికారి విజారత్‌ ఆలీ నోటిఫికేషన్‌ పత్రాన్ని నోటీస్‌ బోర్డులో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఒక్కరిని చైర్మన్‌గా..

13 సంవత్సరాల తర్వాత చేనేత సహకార సంఘాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జోగిపేట చేనేత సహకార సంఘంలో 64 గ్రామాల్లో సభ్యత్వం కలిగిన ఓటర్లు 703 మంది ఉన్నారని తెలిపారు. ఈ సంఘానికి 9 మంది డైరెక్టర్‌లు కాగా, మహిళలకు 2 స్థానాలు, 7 స్థానాలను జనరల్‌గా కేటాయించడం జరిగిందన్నారు. డైరెక్టర్‌లుగా గెలుపొందిన వారిలో నుంచి ఒక్కరిని చైర్మన్‌గా ఎన్నికవుతారని ఆయన తెలిపారు. ఈ సోసైటీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు జోగిపేట చేనేత సహకార సంఘం కార్యాలయంలో వచ్చే నెల 2వ తేదీన నామినేషన్‌ పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు.

Advertisement

Also read: Dowry Harassment: హనుమకొండలో అత్తింటి ముందు.. భార్య అర్ధరాత్రి వరకు పోరాటం..!

5న నామినేషన్‌..

జూలై 3, 4వ తేదీలలో అభ్యర్థుల నామినేషన్‌ల స్వీకరణ, 5న నామినేషన్‌ పత్రాల పరిశీలన, 6న నామినేషన్‌ల ఉప సంహరణ ఉంటుందన్నారు. జూలై 10వ తేదీన ఉదయం 9 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై, మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, ఆదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయన వెంట తాజా మాజీ చైర్మన్‌ వర్కల అశోక్‌తో పాటు కార్మికులు ఉన్నారు.

Advertisement

Also read: RTC Elections: ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×