E-Paper
Advertisement

Illegal Sand: గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం.. యువకుడికి ప్రాణహాని బెదిరింపులు..!

Illegal Sand: గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం.. యువకుడికి ప్రాణహాని బెదిరింపులు..!
Advertisement

Illegal Sand: స్వేచ్ఛ బ్యూరో: ఇసుక అక్రమ దందాకు అలవాటు పడ్డ ముఠా సభ్యులు అడ్డు అదుపు లేకుండా దందాను ఎత్తేచగా కొనసాగిస్తూ కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. తుంగభద్ర నది తీరా గ్రామాల్లో రాత్రి సమయాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ దందాకు రాజకీయ, పోలీసుల అండదండలు ఉండడంతో ఇసుక మాఫీయా ఆగడాలకు అడ్డు అ దుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలలో ఈ అక్రమ రవాణా వల్ల గ్రామాల గుండా టిప్పర్లు మితిమీరిన వేగంతో రాకపోకలు జరగడం వల్ల రహదారులు దెబ్బ తింటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. సామాన్యుల అవసరాలే టార్గెట్ గా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. నదీ తీరంలో కేవలం రూ 2 వేలకే జెసిబి తో టిప్పర్లలో నింపుకుంటూ రవాణా చేస్తూ జిల్లా కేంద్రమైన గద్వాలకు సరఫరా చేసి గృహ వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ అక్రమార్జనకు తెగబడుతున్నారు.

నాగలదిన్నె టు గద్వాల

నడిగడ్డకు మంత్రాలయానికి వారధిగా ఉన్న నాగలదిన్నె సమీపంలోని తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఇసుకను రాత్రి వేలల్లో నది పరివాహక ప్రాంతానికి చేరుకొని జెసిబి ల సహాయంతో నింపుకొని ఐజ తో పాటు గద్వాలకు సరఫరా చేస్తూ కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ఇదంతా గత కొన్ని నెలలుగా యథేచ్ఛగా గా కొనసాగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం పట్ల ఆ వ్యవస్థలపై ఉన్న చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఆన్ లైన్ బుకింగ్ సేవలు నామమాత్రమే

Advertisement

జిల్లా ప్రజలకు వివిధ అవసరాల నిమిత్తం వినియోగించే ఇసుకను పొందేందుకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో ఇసుకాసరులకు వరంలా మారుతోంది. వేసవిలో మాత్రమే సైటు అందుబాటులో ఉంటుండగా వర్షాకాలంలో కేవలం వారానికి ఒకటి రెండు రోజుల్లో కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంచుతుండడంతో గృహాలు నిర్మించుకునే వినియోగదారులు సైట్ ఎప్పుడు వస్తుందో తెలియక వచ్చినా కేవలం కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉండటం లేదని నిరాశకు గురవుతున్నారు. దీంతో బయట దళాలను ఆశ్రయిస్తున్నారు.

Also read: యూట్యూబ్‌ ని షేక్ చేస్తున్న తెలుగు సాంగ్స్ ఇవే….అగ్ర స్థానం ఆహీరోదే !

అక్రమ రవాణా లీకులపై మాఫియా బెదిరింపులు

Advertisement

నాగలదిన్నె కేంద్రంగా చేస్తున్న ఇసుక అక్రమ దందాపై మరొక వర్గం వారు తమకు వ్యతిరేకంగా అధికారులకు సమాచారం ఇస్తున్నారని, తమను ఎవరు ఏమి చేయలేరని దందాకు ఎవరి స్థాయిలో వారికి ముట్ట చెబుతున్నామని, మాపై ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారని ఇకమీదట ఇలా చేస్తే కుదరదని ఇన్నాళ్లు మనం ఒకే గ్రామం వారు కావడంతో చూసి చూడనట్లు నిర్వహించానని, ఎంతోమంది దందా చేశారని, చేస్తున్నారని, మీకు చేతనైతే చేసుకోవాలని,ఇకమీదట ఎదురుపడితే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవాలని, తనకు ఓపిక లేదని ఎవరో ఒకరు లేవాల్సిందేనని బెదిరించడంతో ఆ యువకుడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఆన్లైన్ బుకింగ్లు జరిగేలా..

ప్రస్తుతం జిల్లాలో వివిధ అవసరాల నిమిత్తం ఇసుకకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ బుకింగ్లు జరిగేలా సైట్ ను అందుబాటులో ఉంచడం ద్వారా అక్రమ ఇసుక దందాను అరికట్టి సామాన్య ప్రజలకు మేలు చేయాలని గృహ వినియోగదారులు కోరుతున్నారు. సహజ వనరులను యతేచగా వినియోగించడం ద్వారా ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు సైతం అడుగంటి పోయే పరిస్థితులు ఉన్నాయని సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపి ఇసుకను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read: Hyderabad Drugs: లైవ్ లొకేషన్లతో డెడ్ డ్రాప్ డ్రగ్స్ దందా కలకలం..!

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×