E-Paper
Advertisement

రేవంత్‌కు మైండ్ దొబ్బింది.. మంచి డాక్టర్‌కి చూపించండి: రాంచందర్ రావు

రేవంత్‌కు మైండ్ దొబ్బింది.. మంచి డాక్టర్‌కి చూపించండి: రాంచందర్ రావు
Advertisement

Ramchander Rao: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మైండ్ సరిగ్గా లేదని, ఆయనకు ఎవరైనా మంచి డాక్టర్ చేత చికిత్స చేయించాలని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..

Advertisement

ఓటర్ కార్డుల పరిశీలన (SIR)పై ప్యానిక్ క్రియేట్ చేయడం కాంగ్రెస్ నైజమని రాంచందర్ రావు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా లక్షలాది దొంగ ఓట్లు ఉన్నాయని స్వయంగా కాంగ్రెస్ నేతలే అంగీకరించారని, SIR వల్లే కేరళలో గెలిచామని కూడా చెప్పుకున్నారని గుర్తుచేశారు. ఈవీఎంలను బ్లాక్ బాక్స్ అంటూ విమర్శించే కాంగ్రెస్, అదే ఈవీఎంతో కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో ఎలా గెలిచిందో చెప్పాలన్నారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ (ECI) నిష్పక్షపాతంగా పనిచేస్తోందని, గతంలో కాంగ్రెస్ తమకు కావాల్సిన వారిని నియమించుకుని రిటైర్మెంట్ తర్వాత పదవులు ఇచ్చేదని విమర్శించారు.

హిందూ దేవుళ్లపై చౌకబారు రాజకీయాలు

Advertisement

ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను, ఆచారాలను అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్ రెడ్డి ఈమధ్య బాగా డబ్బులు సంపాదించి ‘రేవంతోద్దీన్’గా మారిపోయారు. దక్షిణాన రామేశ్వరం, కీసరలో రామలింగేశ్వర స్వామి ఉన్నారనే సంగతి మరచిపోయి రాముడు ఎవరు, శివుడు ఎవరంటూ మాట్లాడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ఆసుపత్రి అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు చనిపోతే స్పందించని సీఎం, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

రేవంత్ రెడ్డి హిందూ ఆలయాల్లోకి అడుగుపెట్టే అర్హత కోల్పోయారని, ఆలయాల వద్ద ఆయన ఫ్లెక్సీలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి తరఫున రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. నెలకు కొన్ని ముడుపులు ఢిల్లీకి పంపి, సోనియా-రాహుల్ గాంధీల స్క్రిప్ట్‌ను రేవంత్ ఇక్కడ చదువుతున్నారని ఆయన ఆరోపించారు.

Also Read: ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

హైదరాబాద్ సంస్థ బియ్యంపై అమెరికా ఎఫ్‌డిఏ దృష్టి.. పురుగుమందు అవశేషాలపై హెచ్చరిక

శ్రీమంతుడులా వచ్చి సిరిసిల్లలో పడ్డాడు.. కేటీఆర్‌పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు

పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు శ్రీరాముడు, హర హర మహాదేవ్ ఎందుకనరు-సీఎం రేవంత్

తెలంగాణకు పీఎం సహకరించడం లేదు.. డెవలప్‌మెంట్ ఫైళ్లన్నీ ఆపేస్తున్నారు: సీఎం రేవంత్

మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు ఢీకొని సుమారు 250 గొర్రెలు మృతి!

ఫార్ములా-ఈ కేసులో బిగ్ అప్‌డేట్.. కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తుకు ఏసీబీ పిటిషన్!

Big Stories

Advertisement
×