BigTV English

Robbery In Private Bus: బస్సులో చోరీ.. రూ.4 లక్షలు, 4 కేజీల వెండితో దొంగలు పరార్

Robbery In Private Bus: బస్సులో చోరీ.. రూ.4 లక్షలు, 4 కేజీల వెండితో దొంగలు పరార్

Robbery In Private Bus: మహబూబ్‌నగర్‌ జిల్లా, జడ్చర్లలో చోరీ కలకలం రేపింది. హైదరాబాద్‌ నుంచి తమిళనాడు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జడ్చర్ల వద్ద ఓ హోటల్‌లో భోజనం కోసం ఆపింది. ఆ బస్సులో తమిళనాడుకు చెందిన వ్యాపారి కొమరేషన్.. హైదరాబాద్‌ నుంచి నాలుగు లక్షల డబ్బుతో పాటు నాలుగు కేజీలు వెండి ఒక బ్యాగ్‌లో తీసుకెళ్తున్నారు.


ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో దొంగతనం
భోజనం కోసం ఆయన బ్యాగ్‌ను తీసుకు వెళ్తుండగా.. వెనుక నుంచి కార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న బాధితుడు వెంటనే జడ్చర్ల పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌ నుంచి తమిళనాడు వెళ్తూ..
మహబూబ్‌నగర్‌ జిల్లా, జడ్చర్లలో ప్రాంతంలో భారీ దొంగతనం జరిగినటువంటి ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూర్ వరకు పెద్దఎత్తున అర్థరాత్రి వేళలో బస్సులు ప్రయాణం చేస్తున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి తమిళనాడుకు వెళుతున్నటువంటి ఒక వ్యాపారికి జడ్చర్ల హైవే సమీపంలో మునావార్ అనే దాబా వద్ద బస్సు ఆగింది.


ప్రయాణికుడు కొమరేషన్ ఫుడ్ కోసం దిగిన సమయంలో.. వెనుక నుంచి కార్‌లో వచ్చిన దుండగులు
ఈ దాబా వద్ద నిత్యం ప్రైవేటు వాహానాలు తినడానికి ఆపుతుంటారు. అయితే రోజూ లాగే ఈ బస్సు కూడా అక్కడ ఆగింది. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారి బస్సు దిగి తినడానికి వెళుతుంటాడు.. అతన్ని బాగా అబ్జర్వ్ చేసినువంటి గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి అతని బ్యాగును లాక్కోని వెళ్లిపోతారు. దీంతో ఆ వ్యాపారి ఒక్కసారిగా కంగుతింటాడు.

Also Read: సీటు కోసం లొల్లి.. ప్రభుత్వ టిచర్‌ను 25 మంది దారుణంగా కొట్టి..

రూ.4 లక్షలు, 4 కేజీల వెండి ఉన్న బ్యాగ్‌తో పరార్
ముఖ్యంగా బ్యాగులో రూ.4 లక్షలు, 4 కేజీల వెండి ఉందని చెబుతాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే దీనికి సంబంధించినటువంటి వివరాలను దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా జడ్చర్ల సమీప ప్రాంతంలో చాలా చోట్ల కూడా బారీ దొంగతనాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. అయితే జాతీయ రహదారికి సమీపంలో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున వాహనాల నిలుపుదల.. అలాగే వాహనాల రాకపోకల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన భాదితుడు కొమరేషన్‌ తమిళనాడుకు చెందిన వ్యాపారిగా గుర్తించారు.

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×