BigTV English

Sama Damodar Reddy : కోటి సుపారీ.. వ్యాపారవేత్తకు బెదిరింపులు.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై అనుమానాలు..

Sama Damodar Reddy : కోటి సుపారీ.. వ్యాపారవేత్తకు బెదిరింపులు.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై అనుమానాలు..

Sama Damodar Reddy : ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డికి బెదిరింపుల కేసులో కొత్తపేర్లు తెరపైకి వచ్చాయి. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు దామోదర్ రెడ్డి. వాళ్లిద్దరి మధ్య శంకర్‌పల్లిలోని ఓ ఫాంహౌస్ విషయంలో విభేదాలు ఉన్నాయి. 150 ఎకరాల్లోని ఫాంహౌస్ విషయంలో గతంలోను పోలీసుల్ని ఆశ్రయించారు దామోదర్ రెడ్డి.


తమ భూముల్లోని దేవాలయానికి రంగులు వేసేందుకు దామోదర్ రెడ్డి వెళ్లగా.. జీవన్‌రెడ్డి అనుచరులు ఆయన్ను అడ్డుకున్నారు. ఫాంహౌస్ నుంచి వెళ్లగొట్టారు. అప్పుడు శంకర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని దామోదర్ రెడ్డి గుర్తుచేస్తున్నారు. నాడు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండడంతో అప్పటి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కూడా తన కంప్లైంట్‌ లైట్ తీసుకున్నారని దామోదర్ రెడ్డి అంటున్నారు.

ఇప్పుడు మళ్లీ తనకు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో భయాందోళనకు గురయ్యారు. కోటి రూపాయలకు సుపారీ ఇచ్చారని.. ఆల్రెడీ అరకోటి ముట్టజెప్పారని నోట్ల కట్టల వీడియోని దామోదర్ రెడ్డికి పంపాడు ఆగంతకుడు. ఆ అరకోటి ఇస్తే వదిలేస్తా.. లేదంటే లేపేస్తానంటూ బెదిరించారు. తనతో బిహారీ గ్యాంగ్ ఉందంటూ కొందరి ఫోటోలను సైతం దామోదర్ రెడ్డికి మెసేజ్ చేయడంతో ఈసారి రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×