Man Marries Two Womens: ఇద్దరు యువతులను ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. అతిధుల సమక్షంలో మూడు ముళ్లతో ఒకటయ్యారు ఆ ముగ్గురు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగింది ఈ పెళ్ళి.
గుమ్నూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్.. లాల్ దేవి, జలకర్ దేవితో ఒకేసారి ప్రేమలో పడ్డాడు. ఆ ఇద్దరిని పెళ్లి చేసుకుంటున్నానని శుభలేఖలు పంచాడు. మొత్తానికి ఇద్దరు యువతులని పెళ్లి చేసుకొని ఔరా అనిపించాడు. మూడేళ్ల కిందట మొదలైన అతడి ప్రేమ ప్రస్థానం.. ఇలా ఆరు ముళ్ల బంధంతో సుఖాంతం అయ్యింది.
ఇదేదో సినిమా టైటిల్ కాదు.. రియల్ గానే ఒక వరడు ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 28న ముహూర్తం అందరూ రావాలని పెళ్లి పత్రికలు పంచారు. ఇందులో ఒక వరుడు పేర్లు, ఇద్దరు వధువుల పేర్లు ఉన్నాయి. ఈ పెళ్లి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఒక భర్తకు ఇద్దరు భార్యలు ఉండటం సహజమే. అయితే ఒక భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత అనుకోని కారణాల వల్ల మరో భార్యను పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ వరుడు ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి వివాహం చేసుకున్నాడు. అంతేకాదు వీరిది ప్రేమ వివాహం కూడా. ఇంతకీ అసలు వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళ్తే.. అమ్మో పెళ్లా అన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. అది కూడా ఇద్దరిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి తెలియకుండా సీక్రెట్ వివాహం కూడా కాదు. పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా, పెద్దల ఆశీర్వచనాల మధ్య వైభవంగా పెళ్లి చేసుకున్నాడు.
కొమరంభీమ్ ఆసీఫాబాద్ జిల్లా, లింగాపూర్ మండలం గుమ్మనూరు గ్రామంలో ఈ వింత వివాహం జరిగింది. ఒకే ముహార్త సమయంలో ఇద్దరు యువతుల మెడలో తాళి కట్టాడు సూర్యదేవ్ అనే యువరైతు. అది కూడా అందరికి తెలిసేలా ముందుగానే శుభలేఖలు, యువతీ యువకుల పేర్లు రాయించాడు. అందుకు ఇరువురి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా ఉందని శుభలేఖలు వేయించాడు. గ్రామంలో అందరికీ తెలిసేలా పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు.
Also Read: పొట్టు పొట్టు కొట్టుకున్న ట్రాన్స్ జెండర్లు.. చూస్తూ ఎంజాయ్ చేసిన జనాలు
సుమారు 500 మంది అతిథుల సమక్షంలో ఇద్దరి అమ్మాయిల మెడలో తాళికట్టాడు సూర్యదేవ్, లాల్ దేవి, జలకర్ దేవి ఇద్దరు కూడా ఒకేసారి ప్రేమించాడు. అయితే అతని ప్రేమ విషయం ఇద్దరికి తెలిసిన వారు పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించారు. యువతులు ఇద్దరు కలిసి జీవించడానికి ఓకే చెప్పడంతో పెద్దలు కూడా అందుకు అంగీకారం తెలపడంతో వైభవంగా వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి మీకు అంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది బ్రో అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.