E-Paper
Advertisement

TRS : దొందూదొందే.. ప్రాజెక్టుల పేరిట కాసుల వేట?

TRS : దొందూదొందే.. ప్రాజెక్టుల పేరిట కాసుల వేట?
Advertisement

తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికార, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీనే లక్ష్యంగా చేసుకున్న ఆమె.. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని.. గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనే రేవంత్ సర్కార్ సైతం ఫాలో అవుతున్నదని ఇటీవల ఆమె విమర్శలు గుప్పించారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచిన పాలమూరులో తట్టెడు మట్టి కూడా తీయలేదని సెటైర్లు వేశారు.

బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని టీఆర్ఎస్ చీఫ్ ఆరోపణలు చేస్తున్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ. వేలకోట్లు దోచుకున్నారని.. అందులో గుంటనక్క హస్తం ఉందని పరోక్షంగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రిని టార్గెట్ చేశారు. గతంలోనూ ఆమె ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని మిగతా ప్రాజెక్టును పడావు పెట్టిందని ఫైర్ అయ్యారు. పాలమూరు గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని సైతం ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం పేరిట డబ్బులు దండుకునేందుకే పాలమూరును పక్కన పెట్టారని ఆమె మండిపడ్డారు. కాగా, కవిత చేస్తున్న ఆరోపణలు అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇటు అధికార కాంగ్రెస్ వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి.

రేవంత్ కుమ్మక్కు..

Advertisement

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇఛ్చిందని, అందులో ఏ ఒక్కటిని సరిగా అమలు చేయడం లేదని కవిత విమర్శించారు. ఆరు గ్యారెంటీలు ఇంకెప్పులు అమలు చేస్తారని ప్రశ్నించారు. హామీలు అమలు అయ్యేంత వరకు ప్రజల తరఫున తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ నేతల అవినీతి మీద కేసులు పెట్టిన కాంగ్రెస్ వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం కేసులకే పరిమితం అవుతారా? చర్యలు తీసుకునేది ఏమైనా ఉందా? నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక తేల్చగా.. నాటి నీటిపారుదల శాఖ మంత్రిపై ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదని ఆమె రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు.

తమిళనాడులో ఏం జరిగిందో చూడండి.. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌ నైజం, ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

Advertisement

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య చీకటి ఒప్పందం ఏమైనా? ఉందా? బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎందుకు ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని నిలదీశారు. గతంలో కాళేశ్వరం బీఆర్ఎస్‌కు నోటు బ్యాంకుగా మారితే… ఇప్పుడు తుహ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ నిర్మించతలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీకి కాసులు కురిపించబోనుందని ఆరోపించారు. ఈ విషయంలో గులాబీ పార్టీ బాటలోనే హస్తం పార్టీ కూడా వెళుతోందని చెప్పారు. ప్రాజెక్టుల పేరిట దోచుకోవడంలో ఈ రెంటు పార్టీల విధానం ఒక్కటే అని విమర్శలుచేశారు.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×