E-Paper
Advertisement

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మాలీవుడ్ స్టార్ దర్శకుడు.. కొత్త ప్రాజెక్ట్‌కు అంతా రెడీ?

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మాలీవుడ్ స్టార్ దర్శకుడు.. కొత్త ప్రాజెక్ట్‌కు అంతా రెడీ?
Advertisement

Chiranjeevi Tarun: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మెగాస్టార్’ చిరంజీవి ఎప్పుడూ కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు. తాజాగా ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన యువ దర్శకుడు తరుణ్ మూర్తి మెగాస్టార్ను కలవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read also-విజయ్ ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ పార్టీ ఇన్ట్సా వీడియో వైరల్.. కాంబో అదుర్స్..

మెగాస్టార్ ప్రశంసలు

Advertisement

మలయాళంలో ‘ఆపరేషన్ జావా’, ‘సౌదీ వెల్లక్క’ వంటి విభిన్నమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు తరుణ్ మూర్తి. ఆయన పనితీరును గమనించిన చిరంజీవి, స్వయంగా తన హైదరాబాద్ నివాసానికి పిలిపించుకుని మరీ అభినందించారు. తరుణ్ మూర్తి మేకింగ్ స్టైల్, కథలను డీల్ చేసే విధానం మెగాస్టార్‌కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది.

రీమేక్ వార్తలపై క్లారిటీ

ఈ భేటీ జరిగిన వెంటనే, తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఏదైనా మలయాళ సినిమాను చిరంజీవి రీమేక్ చేయబోతున్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే, ఈ విషయంలో దర్శకుడు స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని, ప్రస్తుతం రీమేక్ ఆలోచనలు ఏవీ లేవని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి వంటి లెజెండరీ నటుడిని కలవడం తన అదృష్టమని, ఆయనకు సినిమా పట్ల ఉన్న అవగాహన చూసి ఆశ్చర్యపోయానని తరుణ్ మూర్తి తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Advertisement

Read also-Vijay Signs First Order: తమిళనాడు సీఎం విజయ్.. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం దానిపైనే

కొత్త కథ చర్చకు వచ్చిందా?

రీమేక్ కాకపోయినప్పటికీ, చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయేలా ఒక సరికొత్త ‘ఒరిజినల్’ కథపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ఇండస్ట్రీ టాక్. మలయాళ దర్శకులు సహజ సిద్ధమైన కథలను తెరకెక్కించడంలో దిట్ట. ఒకవేళ తరుణ్ మూర్తి మెగాస్టార్‌ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తే, అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయం. ప్రస్తుతం చిరంజీవి సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఈ సంక్రాంతికి మన ప్రసాద్ గారు అంటూ వచ్చి మంచి హిట్ సాధించారు. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తరుణ్ మూర్తితో భేటీ జరగడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో వీరి కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. మెగాస్టార్‌ నుంచి పిలుపు రావడం, గంటల తరబడి సినిమా విషయాలను చర్చించడం చూస్తుంటే, త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×