Mahabubabad News: తెలంగాణ రాష్ట్రంలో యూరియా సమస్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఎరువుల కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. వర్షాకాలం సమయంలో పంటలకు అవసరమైన ఎరువులు సరిగా అందకపోవడంతో రైతులు రోజుల తరబడి క్యూలలో నిలబడుతున్నారు. ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూరియా కోసం ఇద్దరు మహిళా రైతులు నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..
యూరియా కేంద్రం వద్ద జుట్లు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్న మహిళలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన pic.twitter.com/5JyP7K0LZa
— ChotaNews App (@ChotaNewsApp) September 5, 2025
ఈ రోజు ఆగ్రోస్ కేంద్రంలో యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారు. రైతులు కూడా పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. అయితే.. ఆధార్ కార్డు నమోదు విషయంలో ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇది కాస్త ఘర్షణగా మారి.. ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులతో ఘోరంగా కొట్టుకున్నారు.. నడిరోడ్డుపై ఈ దృశ్యం చూసిన రైతులు, వాహనదారులు షాక్ అయ్యారు. చివరకు తోటి రైతులు వారిని విడదీయడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ALSO READ: SGPGIMS Notification: భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం
ఈ ఘటనకు మూల కారణం యూరియా సరఫరాలో జాప్యం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రైతులు రాత్రింబవళ్లు క్యూలలో ఉండి, ఒక్క బస్తా కోసం పోటీ పడుతున్నారు. మొన్న మరిపెడ మండలంలో మహిళలు గేట్లు, గోడలు దూకి పరుగులు తీస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మానుకోటలో రైతులు ఎరువుల దుకాణంపై రాళ్లు రువ్వి, బోర్డులు చించివేశిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఎరువుల కొరత పరిణామాలు అని చెప్పవచ్చు.
ALSO READ: OFMK Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్ బ్రో
ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందజేయడం, పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు మహిళా రైతులపై0 ఒత్తిడిని పెంచుతున్నాయి. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం. కాబట్టి రైతుల సమస్యలను ప్రాధాన్యతగా చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వం వెంటనే రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.