BigTV English

Uttam Kumar Reddy: లోకేష్ ఏం మాట్లాడుతున్నవ్.. కొంచెం ఆలోచించు కదా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: లోకేష్ ఏం మాట్లాడుతున్నవ్.. కొంచెం ఆలోచించు కదా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: బనకచర్ల ప్రాజెక్టు గోదావరి నది నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఓ భారీ ప్రాజెక్టు. ఇది సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వినియోగించాలని కూటమి సర్కార్ లక్ష్యంగా  పెట్టుకుంది. అయితే, తెలంగాణ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఇది గోదావరి నీటి కేటాయింపులపై 1980 జల వివాదాల ట్రైబ్యునల్, 2014 రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తుందని, తెలంగాణ రైతులకు నీటి హక్కులపై నష్టం కలిగిస్తుందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సహకారంతో ముందుకు వెళ్తుండగా.. తెలంగాణ న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య జల వనరుల హక్కులపై తీవ్ర చర్చను దారితీస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.


మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం… 

పోలవరం, బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెలంగాణ అన్ని రకాలుగా వ్యతిరేకిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘బనకచర్ల పై ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలు సరైనవి కావు. లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును గోదావరి రివర్ మెనేజ్ మెంట్ బోర్డు వ్యతిరేకించింది. నేనే స్వయంగా నా లెటర్ హెడ్ తో కేంద్రానికి లేఖలు రాశాను. బనకచర్ల ను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. బనకచర్ల పై మా స్టాండ్ క్లియర్ గా ఉంది’ అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.


ALSO READ: IBPS Notification: డిగ్రీ అర్హతతో 10,277 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీలు.. డోంట్ మిస్

బీఆర్ఎస్ ఆరోపణలు పబ్లిసిటీ కోసం మాత్రమే……

బీఆర్ఎస్ పార్టీ చేసే నిరాధారమైన ఆరోపణలు పబ్లిసిటీ కోసం మాత్రమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. బీఆర్ఎస్ వి గాలి మాటలు తప్ప వాస్తవం లేదు. బనకచర్ల ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం. మేము ఎంతటి పోరాటానికి అయినా సిద్ధం. కేంద్ర బీజేపీతో టీడీపీ పొత్తు ఉందని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం.. పొత్తు ఉందని మాట్లాడితే కుదురదు. పోలవరం బనకచర్ల ఇల్లీగల్ ప్రాజెక్టు’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ALSO READ: Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

కేబినెట్ లో కీలక అంశాలపై చర్చిస్తాం….

అలాగే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా మంత్రి మాట్లాడారు.  650 పేజీలతో కాళేశ్వరం పై జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. రేపు సాయంత్రం కమిషన్ రిపోర్ట్ అధ్యయనం కమిటీతో సమావేశం అవుతానని చెప్పారు.  ఈ నెల 4 న క్యాబినెట్ లో కీలక అంశాలపై చర్చిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Related News

Hyderabad Skywalk: హైదరాబాద్‌లో మరో రెండు స్కైవాక్ లు.. ఈ ఏరియాల్లో ప్రజల కష్టాలు తీరినట్లే!

CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్‌అండ్ టీ తప్పుకోలేదు.. ఇది కేసీఆర్ కుట్ర, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Fake doctors: హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్.. ఎలాంటి లైసెన్స్ లేకుండా వైద్యం.. చివరకు?

KTR Elevations: ఇదేం ఎలివేషన్ సామీ? ఓజీ సినిమాపై కేటీఆర్ కి అంత మోజుందా?

Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాల్లో రాత్రంతా కొట్టుడే కొట్టుడు, జాగ్రత్తగా ఉండండి

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువవైన గంజాయి పట్టివేత

Kalvakuntla Kavitha: నేను ఫ్రీ బర్డ్.. బీఆర్ఎస్ నేతలు నాతో టచ్‌లో ఉన్నారు.. త్వరలో బాంబు పేల్చనున్న కవిత?

Income Tax Raids: నాలుగో రోజు క్యాప్స్‌ గోల్డ్ కంపెనీలో ఐటీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Big Stories

×