Vikarabad district Tragedy: ఆధార్ కార్డ్ లేకపోతే అంబులెన్స్‌లో ఎక్కనిచ్చేది లేదు.. ఆక్సిజన్ పెట్టేది లేదు.. మీరు అరిచినా.. ఏడ్చినా.. ఇదే ఫైనల్.. సరిగ్గా ఇలానే కాకపోయినా.. ఇదే అర్థం వచ్చేలా తేల్చి చెప్పారు ఆ కుటుంబానికి అంబులెన్స్ డ్రైవర్లు. దీంతో ఆధార్ కోర్టు కోసం వాళ్లు పరుగులు పెట్టారు. కానీ ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆధార్ కార్డ్ దొరికింది కానీ.. ఆ బాలిక ప్రాణం పోయింది.. అసలు ఆ ఆధార్‌కు ఆధారమే లేకుండా పోయింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
దౌత్తాబాద్ మండలం నందారం గ్రామానికి చెందిన సంగీత అనే బాలికను పాము కాటు వేసింది. ఈ విషయం వెంటనే ఇంట్లో చెప్పింది బాలిక. దీంతో స్థానికులంతా 108కు కాల్ చేశారు. అప్పటికే అరగంట గడిచి పోయింది. సంగీతను వెంటనే కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తాండూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. అక్కడికీ వెళ్లారు.. ఇక్కడ మరికొంత సమయం గడిచిపోయింది. కానీ బాలిక కోలుకోలేదు. తాండూరు ఆస్పత్రిలోని డాక్టర్లు వెంటనే హైదరాబాద్‌కు తరలించాలన్నారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు.
సంగీతను హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌ను రప్పించారు. దాదాపు గంట తర్వాత అంబులెన్స్ వచ్చింది. అందులోని సిబ్బంది ఆమె ఆధార్ కార్డ్ అడిగారు. హడావుడిలో తేలేదని.. మర్చిపోయామని సంగీత తల్లిదండ్రులు చెప్పారు. కానీ కార్డు లేనిదే అంబులెన్స్ ఎక్కించేది లేదని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతోసంగీత పేరెంట్స్ తమ కూతురు పరిస్థితి విషమిస్తోందని వారిని బతిమాలారు.. కానీ వారి తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. అప్పటికే చాలా ఆలస్యం కావడంతో బాలిక ఒంట్లో విషం శరీరంతా విస్తరించింది. దీంతో సంగీత మృతి చెందింది. చేసింది.
Also Read: ‘మాకు తెలంగాణ బియ్యం కావాలి’ – రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఫిలిప్పీన్స్.. ఎందుకంత డిమాండ్..?
అంబులెన్స్ ఉంది.. హాస్పిటల్సూ ఉన్నాయి.. కానీ ఇప్పుడా బాలిక ప్రాణమే లేదు. ఇక తిరిగిరాదు కూడా. మరి బాలిక మృతికి కారణం కాటు వేసిన పామా? ఆధార్ కార్డ్ వెంట తీసుకెళ్లాలని తెలియని ఆ తల్లి అమాయకత్వమా? మానవత్వం లేని మనుషులు చూపించిన నిర్లక్ష్యమా? ఏది కారణం.