E-Paper
Advertisement

కేవలం ఉద్యోగం రాలేదని.. ఆ మహిళ ఏం చేసిందంటే, హైదరాబాద్‌లో చెప్పలేని దారుణం

కేవలం ఉద్యోగం రాలేదని.. ఆ మహిళ ఏం చేసిందంటే, హైదరాబాద్‌లో చెప్పలేని దారుణం
Advertisement

Hyderabad: దంపతుల మధ్య చిన్ని చిన్న గొడవలు ఎన్నైనా ఉండవచ్చు. అది అప్పటికే.. మళ్లీ మరిచిపోతారు. గొడవలు లేని కాపురం ఎక్కడా ఉండదు. కానీ ఉద్యోగం లేదన్న కారణంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మరో విషయం ఏంటంటే మృతురాలికి ఆరేళ్లు కొడుకు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ సిటీలో వెలుగుచూసింది. అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌లో చెప్పలేని దారుణం

కుషాయిగూడ పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. స్వాతి మహాజన్‌- గోపాలకృష్ణ తులసీదాస్‌‌కు దశాబ్దం కింద వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరేళ్లు స్వరూప్‌ అనే కొడుకు ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు యూకేలో ఉద్యోగం చేశారు. రెండేళ్ల కిందట తిరిగొచ్చి కాప్రాలోని మ్యాపిల్ హోమ్ మారుతి బూబ్లీ ఎంక్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత గోపాలకృష్ణకు ఉద్యోగం వచ్చింది.

కేవలం ఉద్యోగం రాలేదని.. వివాహిత ఆత్మహత్య

Advertisement

స్వాతి ఇంకా ఉద్యోగం ప్రయత్నాలు చేసింది.. చేస్తోంది కూడా. ఉద్యోగం దొరకపోవడంతో ఇంటి వద్ద ఉండేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ బాధ నుంచి బయట పడలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సెప్టెంబర్ 30న అనగా బుధవారం పక్కింటి వ్యక్తి మధ్యాహ్నం స్కూల్‌ నుంచి స్వరూప్‌ను ఇంటికి తీసుకొచ్చాడు.

ALSO READ: హైదరాబాద్‌ మహానగరంలో నేటి నుంచి క్యూర్ చట్టం.. పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్

Advertisement

ఇంటి డోర్‌ కొట్టినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో సదరు వ్యక్తి గోపాలకృష్ణకు, అటు పోలీసులకు కూడా సమచారం ఇచ్చాడు. ఇంటికి చేరుకున్న గోపాలకృష్ణ, తలుపులు బద్దలుగొట్టి లోనికి వెళ్లి చూశాడు. అప్పటికే భార్య స్వాతి మహాజన్ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

హైదరాబాద్‌ మహానగరంలో నేటి నుంచి క్యూర్ చట్టం.. పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్

సిటీ మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కామన్ పాస్‌లు ప్రారంభం?

ఆర్మీ డిపోలో ఆయుధాల చోరీ.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు.. 810 బుల్లెట్లు స్వాధీనం!

సీఎం రేవంత్‌ని చూస్తేనే కేటీఆర్‌కు భయమైతుంది: వేముల వీరేశం!

సిరిసిల్ల పర్యటనపై రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్.. ఏమన్నారంటే?

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. సంచలన తీర్పు ఇచ్చిన మేడ్చల్ కోర్టు!

ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆన్‌లైన్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు!

Big Stories

Advertisement
×