
Teenager Molested | 14 ఏళ్ల ఒక అమ్మాయిపై రెండేళ్లగా ఒక యువకుడు అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం ఆమె తన తల్లికి మొదటి నుంచి చెబుతున్నా.. తల్లి పట్టించుకోలేదు. చివరికి వేదన భరించలేక ఆ అమ్మాయి తన అక్కతో ఈ విషయం చెప్పింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆ యువకుడు రెండేళ్లుగా ఎలా అత్యాచారం చేయగలిగాడు. ఆ తల్లి ఎందుకు పట్టించుకోలేదు.. అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన దేశ రాజధాని పక్కనే ఉన్న గాజియాబాద్ నగరంలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. గాజియాబాద్ నగరంలో సాహిబాబాద్ ప్రాంతానికి చెందిన ఒక కాలేజీ ప్రొఫెసర్‌కు ముగ్గరు కూతుర్లున్నారు. మూడో కూతురు పుట్టిన తరువాత అతని భార్యతో గొడవలు మొదలయ్యాయి. ఆ తరువాత ఇద్దరు విడిపోయారు. అలా పదేళ్ల నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ముగ్గరు కూతుర్లలో ఇద్దరు తండ్రి వద్ద ఉండగా.. చిన్న కూతరు తల్లి వద్ద పెరిగింది. ఇప్పుడా చిన్న కూతురికి 14 ఏళ్లు.. తొమ్మిదో తరగతి చదువుతోంది.
కానీ ఆ అమ్మాయిపై రెండేళ్లుగా ఒక యువకుడు అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తానని భయపడించేవాడు. అతనెవరో కాదు. తన తల్లి స్నేహితుడే. అతని పేరు సిరాజ్. రెండేళ్ల క్రితం సిరాజ్ ఆ అమ్మాయి తల్లికి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి అతను తరుచూ వారి ఇంటికి వచ్చేవాడు. ఇంటి పనులలో అమ్మాయి తల్లికి సహాయం చేసేవాడు. అమ్మాయి తల్లి కూడా సిరాజ్ ప్రేమలో పడింది.
మొదటిసారి 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో సిరాజ్ ఒకరోజు ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి ఆమెను లోబర్చుకున్నాడు. సిరాజ్ తనపై అత్యాచారం చేశాడని.. అమ్మాయి చెప్పినా.. ఆమె తల్లి పట్టించుకోలేదు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకోవడం.. అమ్మాయికి ఇష్టంలేనందునే సిరాజ్‌పై ఇలాంటి నిందులు వేస్తోందని అనుకునేది. అలా తన తల్లి నమ్మకపోవడంతో.. సిరాజ్ ఇక తరుచూ ఇంటికి వచ్చి అమ్మాయిపై అత్యాచారం చేసేవాడు. ఈ విషయం ఇక బయటికి చెబితే అమ్మాయితోపాటు, ఆమె తల్లిని కూడా చంపేస్తానని భయపడించేవాడు.
దీంతో ఆ అమ్మాయి ఎవరితో చెప్పాలో తెలియక అతని పెట్టే వేధింపులు భరించేది. అలా రెండేళ్ల పాటు అతను పెట్టే నరకయాతన అనుభవించింది. ఒకరోజు సిరాజ్ అమ్మాయిపై హింసాత్మకంగా అత్యాచారం చేశాడు. ఆ రోజు అతని కొట్టే దెబ్బలు భరించలేక ఆ అమ్మాయి.. తన అక్కకు ఫోన్ చేసి చెప్పింది. ఆ తరువాత వారిద్దరూ పోలీస్ స్టేషన్ వెళ్లి సిరాజ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సిరాజ్‌ను అరెస్టు చేసి.. విచారణ చేస్తున్నారు.