E-Paper
Advertisement

Balakrishna: బాలయ్య మొదటి పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం.. కానీ హీరోగా కాదు..!

Balakrishna: బాలయ్య మొదటి పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం.. కానీ హీరోగా కాదు..!
Advertisement

Balakrishna: ప్రస్తుతం చాలామంది యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ కోసం కష్టపడుతున్నారు. కానీ సీనియర్ హీరోలు మాత్రం వారి వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ హిట్స్ కొట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. చాలావరకు సీనియర్ హీరోలు ఈ పాన్ ఇండియా ట్యాగ్ కోసం ఆశపడడం లేదు. అందులో బాలకృష్ణ కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించే సినిమాలు తెలుగుతో పాటు తమిళంలో కూడా డబ్ అయ్యి విడుదలవుతూ ఉంటాయి. అంతే కానీ అంతకు మించి పాన్ ఇండియా స్టేటస్‌పై ఎప్పుడూ ఆశపడని బాలకృష్ణ.. మొదటిసారి ఒక పాన్ ఇండియా మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

గెస్ట్ రోల్స్

Advertisement

కెరీర్‌లో మొదటిసారి పాన్ ఇండియా మూవీకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నా అందులో తాను హీరోగా నటించడం లేదనే వార్త ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. ఒక పాన్ ఇండియా మూవీలో మొదటిసారి గెస్ట్ రోల్‌లో నటించడానికి బాలయ్య ఒప్పుకున్నాడని సమాచారం. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్, రజినీకాంత్ కాంబినేషన్‌లో ‘జైలర్ 2’ (Jailer 2) సినిమా తెరకెక్కుతోంది. మూడేళ్ల క్రితం విడుదలయిన ‘జైలర్’ మూవీ ఓ రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో కూడా కన్నడ నుండి శివ రాజ్‌కుమార్, మలయాళం నుండి మోహన్ లాల్‌ను క్యామియో కోసం ఒప్పించాడు దర్శకుడు నెల్సన్. ఇప్పుడు సీక్వెల్‌లో గెస్ట్ రోల్ కోసం ఏకంగా బాలయ్యనే ఒప్పించడానికి సిద్ధమయ్యాడట.

రిజెక్ట్ చేశాడు

Advertisement

అసలైతే ‘జైలర్’ సినిమాలో మోహన్ లాల్ చేసిన పాత్ర చేయడానికి ముందుగా బాలకృష్ణ (Balakrishna)కే అవకాశం లభించిందట. కానీ ఆ క్యారెక్టర్ తనకు మరీ వీక్‌గా అనిపించడంతో తాను చేయనని రిజెక్ట్ చేశాడని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. పైగా బాలకృష్ణను ‘జైలర్’ మూవీలో క్యామియో చేయడం కోసం అప్రోచ్ అయ్యానని నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నాడు. అందుకే ‘జైలర్’లో గెస్ట్ రోల్ చేయడానికి తనను ఒప్పించలేకపోయినా.. సీక్వెల్‌లో నటించడానికి మాత్రం ఒప్పిస్తానని నెల్సన్ అప్పుడే ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే ‘జైలర్ 2’లో బాలయ్య క్యామియో కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

Also Read: ఇప్పటినుండి తమన్ పేరు అదే.. కొత్తగా నామకరణం చేసిన బాలయ్య

స్నేహం కోసం

బాలకృష్ణ, రజినీకాంత్ (Rajinikanth) మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రజినీ సినిమాలో క్యామియో అంటే దాదాపు తెలుగులో ఏ సీనియర్ హీరో అయినా నో చెప్పడానికి ఇష్టపడరు. అలాగే ‘జైలర్ 2’లో ఒక పవర్‌ఫుల్ క్యామియోతో నెల్సన్ దిలీప్ కుమార్.. బాలయ్యను అప్రోచ్ అయితే ఆయన కూడా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేయరని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే ప్లాన్ వర్కవుట్ అయితే మొదటిసారి రజినీకాంత్, బాలయ్యను ఒకే స్క్రీన్‌పై చూడొచ్చని ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్‌తో ఎదురుచూస్తున్నారు. అలాగే హీరోగా కూడా బాలయ్య ఏదైనా పాన్ ఇండియా మూవీలో నటిస్తే బాగుంటుందని తన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×