Dhanush Remuneration: కోలీవుడ్ నటుడు ధనుష్(Danush) కుబేర సినిమా(Kuberaa Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డబ్బు చుట్టూ తిరుగుతుందని చెప్పాలి సినిమాలో ధనుష్ ఒక బెగ్గర్(Begger) పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల నడుమ నేడు హిందీ తమిళ తెలుగు భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజే అద్భుతమైన ఓపెనింగ్స్ రాబడుతూ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని ప్రాంతాలలో కుబేర సినిమాకు ఎంతో మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
సినిమా ఆలస్యం.. రేటు పెంచిన హీరో..
ధనుష్ ఇటివల కాలంలో తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇదివరకే సార్ సినిమాతో హిట్ కొట్టిన ధనుష్ ఇప్పుడు కుబేర సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ధనుష్ కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంచి మార్కెట్ ఉన్న హీరో అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్(Remuneration) తీసుకున్నారని తెలుస్తోంది. సాధారణంగా ధనుష్ ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అయితే కుబేర సినిమా కోసం ఈయన 30 కోట్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తుంది.
అదనంగా ఐదు కోట్లు…
ఇలా ఈ సినిమాకు 30 కోట్ల రెమ్యూనరేషన్ కు అగ్రిమెంట్ కుదుర్చుకున్న ధనుష్ ఇప్పుడు మాత్రం అదనంగా రెమ్యూనరేషన్ చార్జ్ చేశారని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా చాలా ఆలస్యమైన తరుణంలోనే ఈయన అదనంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కుబేర సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల నుంచి శేఖర్ కమ్ముల పని చేస్తున్నారు. ఇలా ఈ సినిమా ఆలస్యం కావడంతోనే అదనంగా మరో ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ ఈ సినిమాకు ఏకంగా 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించిన రష్మిక మందన్న (Rashmika Mandhanna)హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక నటుడు నాగార్జున(Nagarjuna) కూడా కీలకపాత్రలో నటించారు. ఎప్పటిలాగే శేఖర్ కమ్ముల ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన మ్యాజిక్ తో వెండి తెరపై ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నారని చెప్పాలి. ఇక కుబేర సినిమా మంచి సక్సెస్ కావడంతో ధనుష్ శేఖర్ కమ్ములతో మరో ప్రాజెక్టు కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కొత్త సినిమాకు సంబంధించి ఒక లైన్ చెప్పగా అది ధనుష్ కి బాగా నచ్చడంతో కథ సిద్ధం చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ధనుష్ ప్రస్తుతం పలు తమిళ సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Shalini Pandey: ఆ డైరెక్టర్ న్యూ**గా చూసాడు.. బాంబు పేల్చిన అర్జున్ రెడ్డి బామ!