E-Paper
Advertisement

Sleeper Coaches: సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఆ 6 రైళ్లలో స్లీపర్ బోగీల సంఖ్య పెంపు!

Sleeper Coaches: సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఆ 6 రైళ్లలో స్లీపర్ బోగీల సంఖ్య పెంపు!
Advertisement

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లలో స్లీపర్ కోచ్ లను తగ్గించి, ఏసీ కోచ్ లను పెంచిన నేపథ్యంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 23 నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో స్లీపర్ కోచ్‌లను పెంచాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రాకపోకలు కొనసాగించే ఎంతో మంది ప్రయాణీకులకు లాభం కలగనుంది.

స్లీపర్ కోచ్ లు పెంచిన రైళ్లు ఇవే!

Advertisement

⦿ హైదరాబాద్‌-ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ముంబై, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్‌-హైదరాబాద్‌ మధ్య రాకపోపలు కొనసాగించే ముంబై ఎక్స్ ప్రెస్ లో(22731/22732 సెప్టెంబరు 23, 26 తేదీల నుంచి 2 స్లీపర్ కోచ్ లు జత చేయనున్నారు.

⦿ ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ముంబై- హైదరాబాద్, హైదరాబాద్‌-ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ముంబై మధ్య నడిచే   హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ (12701/12702)లో సెప్టెంబరు 24, 25 తేదీల నుంచి 2  స్లీపర్‌ బోగీలు పెరగనున్నాయి.

Advertisement

⦿ సికింద్రాబాద్‌- భువనేశ్వర్, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే  విశాఖ ఎక్స్‌ ప్రెస్‌ (17016/17015)లో సెప్టెంబరు 23, 25 తేదీల నుంచి 3 చొప్పున స్లీపర్‌ బోగీలు పెరగనున్నాయి.

Read Also: విశాఖకు వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్, మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చూడండి!

ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు

ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ, తమిళనాడు, కేరళ మధ్య నడుస్తున్న ఆరు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

ప్రస్తుతం సోమవారాల్లో నడిచే నడిచే (రైలు నెం. 07191) కాచిగూడ–మధురై స్పెషల్, ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 13 వరకు నడుస్తుంది. బుధవారం నాడు తిరుగు ప్రయాణం అయ్యే (రైలు నెం. 07192) మధురై–కాచిగూడ స్పెషల్, ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 15 వరకు నడుస్తుంది.

హైదరాబాద్–కొల్లం స్పెషల్(రైలు నెం. 07193) ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 11 వరకు శనివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 07194) కొల్లం–హైదరాబాద్ స్పెషల్, ఆగస్టు 18, అక్టోబర్ 13 మధ్య సోమవారాల్లో నడుస్తుంది.

ఇక హైదరాబాద్–కన్యకుమారి స్పెషల్ (రైలు నెం. 07230) ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 8 వరకు బుధవారాల్లో నడుస్తుంది. కన్యకుమారి–హైదరాబాద్ స్పెషల్(రైలు నెం. 07229) ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 10 వరకు శుక్రవారాల్లో నడుస్తుంది. తమిళనాడు, కేరళ, హైదరాబాద్ మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు.

Read Also:  ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే ఆ రైళ్లలో అదనపు కోచ్‌లు.. ఇక బెర్త్ కన్ఫార్మ్ పక్కా!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×