BigTV English
Advertisement

Bangladesh Railway: బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిలిచిపోయిన రైళ్లు, స్టేషన్లలో ప్రయాణీకుల అవస్థలు, ఇంతకీ ఏం జరిగిందంటే?

Bangladesh Railway: బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిలిచిపోయిన రైళ్లు, స్టేషన్లలో ప్రయాణీకుల అవస్థలు, ఇంతకీ ఏం జరిగిందంటే?

Bangladesh Railway Strick: బంగ్లాదేశ్ వ్యాప్తంగా రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే యూనియన్ మెరుపు సమ్మెకు దిగడంతో రైల్వే సేవలు ఆగిపోయాయి. అకస్మాత్తుగా సమ్మెకు పిలుపునివ్వడంతో వేలాది మంది ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.


డిమాండ్ల సాధన కోసం దేశ వ్యాప్త సమ్మె

రైల్వే ఉద్యోగకులకు పెన్షన్లు పెంచడంతో పాటు ఇతర ప్రయోజనాలను అందించాలని కోరుతూ.. బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ మెరుపు సమ్మెకు పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని యూనియన్ ప్రెసిడెంట్ సయ్యుదుర్ రెహమాన్ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తో సమావేశం అయినట్లు వెల్లడించిన ఆయన, చర్చల్లో ఏమాత్రం పురోగతి లేదన్నారు. ప్రభుత్వం, యూనియన్ మధ్య ఎలాంటి అంగీకారం జరగలేదన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాని కారణంగానే సమ్మెకు దిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు అవసరం అయితే నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.


సమ్మె విరమించాలని కోరిన బంగ్లాదేశ్ సర్కారు

రైల్వే సిబ్బంది డిమాండ్లను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని బంగ్లాదేశ్ సర్కారు వెల్లడించింది. సిబ్బంది డిమాండ్లను తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. రైల్వే సిబ్బంది సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల అవస్థలు

ఈ సమ్మె ప్రభావం 100కు పైగా ఇంటర్ సిటీ సర్వీసులు, దాదాపు 400 ప్యాసింజర్ రైళ్లు, సుమారు 35 గూడ్స్ రైళ్ల మీద ప్రభావం చూపించింది. ఒక్కసారిగా రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగడంతో, రైళ్లు ఎక్కేందుకు వచ్చిన ప్రయాణీకులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ఢాకాలోని రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. రైల్వే ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని తెలియడంతో స్టేషన్లకు చేరుకున్న ప్రయాణీకులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. అత్యవసర ప్రయాణాలు ఉన్న వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. మరికొంత మంది ప్రయాణీకులు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. సడెన్ గా రైళ్లు రద్దు అంటే, ఎలా అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కొన్ని స్టేషన్లలో ప్రయాణీకులను రైల్వే అధికారులు బస్సులలో పంపించే ప్రయత్నం చేశారు.  అటు బంగ్లాదేశ్‌ లోని వాణిజ్య కేంద్రం అయిన ఛటో గ్రామ్‌ లోనూ రైల్వే సిబ్బంది సమ్మెకు దిగారు. ఛటో గ్రామ్‌ కు రైళ్లలో వస్త్ర ఉత్పత్తులు వస్తుంటాయి. వాటిని ఇక్కడి పోర్టు ద్వారా  అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ సమ్మెతో వస్త్ర ఎగుమతులు నిలిచిపోయాయి.

సమ్మె ఎందుకంటే?

ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభా దాదాపు 17 కోట్లు ఉంది. 36 వేల కిలో మీటర్ల మేర రైల్వే నెట్ వర్క్ ఉన్నది.  రైల్వే సంస్థ ద్వారా నిత్యం 2.5 లక్షల మంది ప్రయాణిస్తారు. ఏడాదికి సుమారు 9 కోట్ల మంది ప్రయాణీకులు గమ్యస్థానాలకు చేరుకుంటారు. దేశంలో దాదాపు 25 వేల మంది రైల్వే సిబ్బంది ఉన్నారు.

Read Also:  దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైళ్లు ఇవే, ఏక బిగిన ఎన్ని కిలో మీటర్లు నడుస్తాయంటే?

Related News

Karnataka Tour: కర్ణాటకలోని..ఈ ప్రదేశాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Big Stories

×