E-Paper
Advertisement

బెంగళూరు నుంచి ముంబైకి స్లీపర్ వందే భారత్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే?

బెంగళూరు నుంచి ముంబైకి స్లీపర్ వందే భారత్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే?
Advertisement

Bengaluru-Mumbai Vande Bharat Sleeper Train: బెంగళూరు, ముంబై మధ్య రైలు ప్రయాణం చేసే వారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కేఎస్ఆర్ బెంగళూరు-ముంబై సీఎస్ఎంటీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. చాలా కాలంగా ఈ రైలు గురించి చర్చ జరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు దీనికి సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ నెల చివరి నాటికి సర్వీసును ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం  

బెంగళూరు, ముంబై దేశంలోని ముఖ్యమైన నగరాలు. ఒకటి టెక్నాలజీ రంగానికి కేంద్రంగా ఉంటే.. మరొకటి దేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందింది. ఈ రెండు నగరాల మధ్య నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి ముంబైకి నేరుగా వెళ్లే ప్రధాన రైళ్లలో ఉద్యాన్ ఎక్స్‌ ప్రెస్ ఒకటి. ఈ రైలు ప్రయాణానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. అయితే, కొత్తగా రానున్న వందే భారత్ స్లీపర్ రైలు ఈ ప్రయాణ సమయాన్ని 16 గంటలలోపే పూర్తి చేయనుంది.

రాత్రి బయలుదేరి.. మరుసటి రోజు ముంబైకి!

Advertisement

ప్రస్తుత ప్రతిపాదిత టైమ్‌ టేబుల్ ప్రకారం.. వందే భారత్ స్లీపర్ రైలు కేఎస్ఆర్ బెంగళూరు నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరే అవకాశం ఉంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో సీఎస్ఎంటీ ముంబైకి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి రాత్రి 10:30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది.

వారానికి ఆరు రోజుల ప్రయాణం  

ఈ వందే భారత్ స్లీపర్ రైలును వారానికి ఆరు రోజుల పాటు రెండు దిశల్లో నడిపేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభ తేదీపై రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే, ఈ నెల 10 లేదంటే 11న  సర్వీసును ప్రారంభించాలని సంబంధిత రైల్వే జోన్లకు సూచనలు వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

హుబ్బళ్లి మీదుగా వెళ్లదా?   

Advertisement

ఈ కొత్త రైలు మార్గంలో మరో కీలక మార్పు ఉంది. బెంగళూరు-ముంబై మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ హుబ్బళ్లి మీదుగా వెళ్లదు. అనంతపురం, గుంతకల్, రాయచూర్, కలబురగి, సోలాపూర్, కళ్యాణ్ లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగేలా మార్గాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతాల నుంచి బెంగళూరు, ముంబై వైపు ప్రయాణించే వారికి కూడా వేగవంతమైన రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న డిమాండ్

బెంగళూరు నుంచి ముంబైకి సూపర్ ఫాస్ట్ రైలు కనెక్టివిటీ కావాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులు ఈ విషయాన్ని కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం పెద్దగా తగ్గలేదు. వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.

Read Also: రైలు టికెట్ బుక్ చేశారా? ప్రయాణం కుదరకపోతే సింపుల్ గా వేరొకరికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు!

Tags

Related News

చీనాబ్ వంతెనపై 100 కి.మీ వేగంతో వందే భారత్ పరుగులు.. వీడియో చూశారా?

టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్స్‌‌పై నిషేధం.. ఎందుకంటే?

నేషనల్ గార్డ్‌ లో చిన్న కమాండో.. యూనిఫాం, తలకు హెల్మెట్ తో భలే ఉందిగా!

జపాన్‌లో శాశ్వత నివాసం అంత ఈజీ కాదు.. ఫీజు 20 రెట్లు పెంపు, కొత్త రూల్స్!

ఇసుకను జల్లెడ పడితే బంగారం దొరుకుతుందట.. మునేరులో వింత వేట!

మందు ముట్టరు.. కట్టుబాటు దాటరు.. 25 ఏళ్లుగా మద్యానికి దూరంగా 11 గ్రామాలు!

పెట్రోల్‌ రూల్స్‌ లో బిగ్‌ చేంజ్‌.. లైసెన్సు లేకుండా బిజినెస్ చేస్తే ఇక అంతే సంగతులు!

Big Stories

Advertisement
×