Viral Video: టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతోంది. అందులో భాగంగానే ప్రజల ముందుకు వచ్చింది చాట్ జీపీటీ. ప్రపంచంలోని ఏ విషయాన్ని అయినా ఇట్టే చెప్పేస్తోంది. సోది లేకుండా సూటిగా, సుత్తి లేకుండా వినియోగదారులకు అందిస్తోంది. చాట్ జీపీటీని ఇతర దేశాల ప్రజలకు ఎలా ఉపయోగిస్తున్నారో తెలియదు కానీ, ఇండియన్స్ వాడకం మామూలుగా లేదు. చివరకు ఆటో డ్రైవర్లతో కిరాయి గురించి కూడా బేరాలు ఆడిస్తున్నారు. చాట్ జీపీటీ, ఆటో డ్రైవర్ తో బేరం ఆడటం ఏంటీ? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, మీరు ఈ వీడియో చూడాల్సిందే!
India is not for beginners.
Bengaluru youth uses ChatGPT to negotiate auto fare in Kannada.pic.twitter.com/zD7U8LN1MJ
— Neetu Khandelwal (@T_Investor_) April 28, 2025
ఆటో ఛార్జీ తగ్గించాలంటూ డ్రైవర్ తో చాట్ జీపీటీ బేరం!
తాజాగా బెంగళూరుకు చెందిన ఓ విద్యార్థి ఆటోలో ప్రయాణం చేశాడు. ఆటో డ్రైవర్ రూ. 200 ఇవ్వాలని సదరు ప్రయాణీకుడిని కోరాడు. కానీ, అతడు డ్రైవర్ తో బేరం ఆడేందుకు చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. “ఆటో డ్రైవర్ ఛార్జీ రూ. 200 ఇవ్వమంటున్నాడు. నేను స్టూడెంట్ ను. అంతాగా ఇచ్చుకోలేను. రూ. 100 తీసుకోమని చెప్పొచ్చు కదా?” అని అడుగుతాడు. ఇక చాట్ జీపీటీ రంగంలోకి దిగుతుంది. ఆటో డ్రైవర్ తో బేరం మొదలు పెడుతుంది. “అన్నా నమస్కారం. అతడు రెగ్యులర్ కస్టమర్. పైగా స్టూడెంట్. తన దగ్గర రూ. 100 తీసుకోవచ్చు కదా” అంటుంది. “మరీ రూ. 100 అంటే తనకు పడదు” అని డ్రైవర్ చెప్తాడు. వెంటనే జోక్యం చేసుకున్న చాట్ జీపీటీ “మీరు, కాదు, తను కాదు, చివరికి రూ. 120 తీసుకోండి” అని ఫైనల్ చేస్తుంది. ఇద్దరు సరే అనుకుంటారు.
Read Also: క్రూయిజ్ షిప్ అనుకున్న టైమ్ కి బయల్దేరకపోతే ఫైన్ వేస్తారా? ఆశ్చర్యంగా ఉందే!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఆటో డ్రైవర్ తో చాట్ జీపీటీ బేరానికి సంబంధించిన వీడియోను సదరు స్టూడెంట్ రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. “అబ్బా.. ఏం వాడకం అయ్యా మీది” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “ఇన్నాళ్లు చాట్ జీపీటీతో ఓన్లీ ఇన్ఫర్మర్ మాత్రమే లభిస్తుందని అనుకున్నాం. ఏకంగా ఆటో డ్రైవర్లతో బేరం ఆడే స్థాయికి తీసుకొచ్చారా? మీరు మహానుభావులండీ” అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “టెక్నాలజీని ఇలా కూడా వాడవచ్చని చూపించిన ఆటో డ్రైవర్ కు , ఆ స్టూడెంట్ కు నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే” అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Read Also: గాంధీజీని అలా మార్చేశావేంటయ్యా? ఇది తప్పు అనిపించడం లేదా?