Food For Hair Growth: ప్రతి ఒక్కరూ బలమైన, మందపాటి జుట్టు ఉండాలని కోరుకుంటారు. కానీ మన ఆహారపు అలవాట్లే జుట్టును ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. జుట్టు ఆరోగ్యం బాహ్యంగా ఉపయోగించే వస్తువులపై మాత్రమే ఆధారపడి ఉండదు.. లోపలి నుండి పోషణ అందించడం కూడా అంతే ముఖ్యం. జుట్టును బలోపేతం చేయడానికి.. రాలిపోకుండా కాపాడటానికి జుట్టు పెరుగుదలకు సహాయపడే అనేక ఆహారాలను ప్రకృతి మనకు ప్రసాదించింది. వీటిని తినడం వల్ల జుట్టు చాలా బాగా పెరుగుతుంది. అంతే కాకుండా ఇది మీ జుట్టును లోపలి నుండి బలోపేతం చేస్తుంది. మరి ఏ విధమైన ఆహార పదార్థాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వాల్నట్స్:
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలకు పోషణనిస్తాయి. అంతే కాకుండా జుట్టు మూలాలను కూడా బలోపేతం చేస్తాయి. వీటిలో బయోటిన్ , విటమిన్ ఇ కూడా ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా మెరిసేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్న వారు తరచుగా వాల్నట్స్ తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
ఎగ్స్:
జుట్టు యొక్క ప్రధాన భాగం ప్రోటీన్. గుడ్లు ప్రోటీన్ యొక్క ఉత్తమ వనరులలో ఒకటి. గుడ్లలో ఉండే బయోటిన్ జుట్టు మూలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది. ఎగ్స్ ప్రతి రోజూ తినడం వల్ల కూడా జుట్టుకు అవసరం అయిన పోషకాలు లభిస్తాయి.
పాలకూర:
ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారుతోంది. పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ తో పాటు విటమిన్లు ఎ , సి ఉంటాయి. ఇవి జుట్టు కణాలకు ఆక్సిజన్ , పోషణను అందించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా పాలకూరలో సహజంగా సెబమ్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది జుట్టును తేమగా చేస్తుంది.
క్యారెట్:
క్యారెట్లు కళ్ళకు మాత్రమే కాదు.. జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. క్యారెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు బలంగా , మెరిసేలా తయారవుతుంది.
పెరుగు:
పెరుగులో ఉండే ప్రోటీన్ , విటమిన్ బి5 జుట్టు మూలాలను బలోపేతం చేయడంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జుట్టును మృదువుగా చేస్తుంది. ఇది తలపై చర్మాన్ని చల్లబరుస్తుంది. జుట్టు పొడిబారడాన్ని కూడా తొలగిస్తుంది. వారానికి రెండు మూడు సార్లు పెరుగు తినడం లేదా జుట్టుకు రాసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మెంతి గింజలు:
మెంతి గింజలను ఆయుర్వేదంలో చాలా సంవత్సరాలుగా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉండే ప్రోటీన్లు , నికోటినిక్ ఆమ్లం జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. అంతే కాకుండా చుండ్రును నివారిస్తాయి. మీరు మెంతి గింజలను ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా రాత్రంతా నానబెట్టి ఉదయం తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా వీటిని పేస్ట్ లా తయారు చేసి మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి.
Also Read: చర్మ రకాన్ని బట్టి ఫేస్ వాష్ ఎలా సెలక్ట్ చేసుకోవాలి ?
నారింజ:
విటమిన్ సి జుట్టు మూలాలను బలోపేతం చేసే కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. నారింజ వంటి సిట్రస్ పండ్లు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.