ఢిల్లీ సమీపంలో చూడదగిన పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. సిమ్లా అందాలు, వారణాసి ఆధ్యాత్మికత, జైసల్మేర్ రాచరిక వైభవం, ఆగ్రా పాలరాతి సొగసు ఒకటేమిటీ ఎన్నో అద్భుత ప్రదేశాలను చూసే అవకాశం ఉంది. అయితే, ఢిల్లీ నుంచి ఒకే రోజులో వెళ్లే వచ్చే టూరిస్ట్ స్పాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ఢిల్లీ నుంచి సిమ్లా(కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్): ఢిలీ నుంచి ఒక్క రోజులో వెళ్లి రావాలి అనుకునే వారికి సిమ్లా బెస్ట్ టూరిస్ట్ స్పాట్. ఢిల్లీ నుంచి సిమ్లాకు నేరుగా రైల్లో వెళ్లొచ్చు. అక్కడ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు. శీతాకాలం సమయంలో ఈ ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. టాయ్ ట్రైన్ 102 సొరంగాలు, 864 వంతెనలు దాటుతూ పైన్ అడవుల మీదుగా కొనసాగుతుంది. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల కనువిందు చేస్తాయి.
⦿ ఢిల్లీ నుంచి వారణాసి (కాశీ విశ్వనాథ్ ఎక్స్ ప్రెస్): ఢిల్లీ నుంచి యూపీలోని వారణాసికి రైలు చాలా బాగుంటుంది. కాశీలోని ఆధ్యాత్మిక వాతావరణం మానసిక ఆహ్లాదంతో పాటు భక్తిపారవశ్యంలో ముంచుతుంది. వారణాసి ఘాట్ లు, దేవాలయాలు, అద్భుతమైన సంస్కృతి, సంప్రదాయాలు ఆకట్టుకుంటాయి. ఢిల్లీ నుంచి కాశీ విశ్వనాథ్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లొచ్చు. ప్రస్తుతం ఈ మార్గాల్లో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి.
⦿ ఢిల్లీ నుంచి జైసల్మేర్(ఢిల్లీ-జైసల్మేర్ ఎక్స్ ప్రెస్): రాజస్థాన్ లోని ఎడారి అందాలు, రాచరిక ఆనవాళ్లు చూడాలనుకునే వారికి ఈ ప్రయాణం చాలా నచ్చుతుంది. థార్ ఎడారి మధ్యలో ఉన్న గంభీరమైన కోటలు, హవేలీలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో ఒకటి ఢిల్లీ నుంచి జైసల్మేర్, మరొకటి జైసల్మేర్ నుంచి ఢిల్లీకి నడుస్తుంది.
Read Also: 158 ఏండ్ల క్రితం పట్టాలెక్కిన రైలు, ఇప్పటికీ నడుస్తోంది, ఎక్కడో తెలుసా?
⦿ ఢిల్లీ నుంచి ఆగ్రా (గతిమాన్ ఎక్స్ ప్రెస్): ఢిల్లీ నుంచి ఆగ్రాలోని తాజ్ మహల్ ను చూడాలి అనుకునే వాళ్లు గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లొచ్చు. చారిత్రక ప్రేమ చిహ్నాన్ని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఒకే రోజులో ఢిల్లీ నుంచి వెళ్లి రావచ్చు. దేశంలోనూ తొలి హైస్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్ ప్రెస్ ప్రయాణం చెయ్యొచ్చు. ఢిల్లీ- ఆగ్రా నడుమ ఈ రైలు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నది. 100 నిమిషాల్లో ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్తుంది. ఇందులో రుచికరమైన భోజనాన్ని కూడా అందిస్తారు.
⦿ ఢిల్లీ నుంచి హరిద్వార్ (శతాబ్ది ఎక్స్ ప్రెస్): ఆధ్యాత్మిక పర్యటన చేయాలి అనుకునే వారికి ఈ ప్రయాణం చాలా బెస్ట్. ఢిల్లీ నుంచి ఉత్తారఖండ్ లోని హరిద్వార్ కు వెళ్లొచ్చు. గంగానదలో పవిత్ర స్నానం చేసి, ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఇక్కడ గంగా హారతిని చూసి పాపాలను తొలగించుకోవచ్చు. పవిత్ర నగరంలో పర్యటించి పునీతులు కావచ్చని భక్తులు విశ్వసిస్తారు.
Read Also: శీతాకాలంలో ఛల్ చయ్య చయ్య చయ్యా.. ఈ ట్రైన్ జర్నీ చేస్తే ఉంటుందయ్యా!