BigTV English

India – Pakistan : భారత్ దెబ్బకు పాక్‌కు మైండ్ బ్లాక్.. బోర్డర్‌లో వార్ సైరన్..

India – Pakistan : భారత్ దెబ్బకు పాక్‌కు మైండ్ బ్లాక్.. బోర్డర్‌లో వార్ సైరన్..

India – Pakistan : యాక్ట్ ఆఫ్ వార్. భారత్ తమ దేశంపై యుద్ధం ప్రకటించినట్టేనని భయపడుతోంది పాకిస్తాన్. సింధూ జలాలను ఆపడమంటే.. జంగ్ సైరన్ మోగించినట్టేనని ఆందోళన చెందుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో తెలీక.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. సేమ్ టు సేమ్ ఇండియా చేసినట్టు.. పాకిస్తాన్ కూడా భారతీయులకు వీసాలను రద్దు చేసింది. తక్షణమే తమ దేశం విడిచిపోవాలని ఆదేశించింది. ఇండియన్ హైకమిషనర్‌కు కూడా వెళ్లిపోవాలని సూచించింది. ఇవన్నీ అంతకుముందే భారత్ తీసుకున్నా నిర్ణయాలే.


పాక్ ఆర్మీ అలర్ట్

అటు, సరిహద్దుల్లో ఏదో జరిగిపోతున్నట్టు పాకిస్తాన్ డ్రామా క్రియేట్ చేస్తోంది. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేశారు. ఇండియా దాడి చేస్తే తిప్పి కొట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి యుద్ధ పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని ఆర్మీకి సూచించారు. మరోవైపు, భారత పౌర విమానాలు పాకిస్తాన్ గగనతలం వాడకుండా నిషేధం విధించింది. ఇండియాతో అన్ని రకాల వ్యాపార సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది.


వాటర్ వార్ షురూ..

కశ్మీర్‌ ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం.. పాక్‌కు దిమ్మతిరిగే నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమే గాకుండా.. వీసాలను కూడా రద్దు చేసింది. వెంటనే పాక్ జాతీయులు దేశం విడిచి వెళ్లిపోవాలంది. దీంతో పాకిస్థాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ అత్యవసరంగా సమావేశమై.. కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌ తీసుకున్న నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది పాక్ ప్రభుత్వం. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నీటి యుద్ధంతో సమానమని తెలిపింది. ఈ విషయంలో భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేరని.. ఇందులో వరల్డ్ బ్యాంక్‌ కూడా ఇన్వాల్వ్ అయ్యిందని తెలిపింది. సింధూ నది జలాల విషయంలో తాము న్యాయపోరాటం చేస్తామంటోంది పాక్ ప్రభుత్వం. సింధు నదిలో ప్రతి నీటి బొట్టు తమ హక్కు అంటోంది.

పాక్ స్టాక్ మార్కెట్లు పతనం

మరోవైపు, భారత నిర్ణయాలత పాకిస్తాన్ ఆర్థిక పతనం మొదలైంది. ఆ దేశ స్టాక్‌ మార్కెట్లపై తొలి దెబ్బ పడింది. KSE-100 ఇండెక్స్ 2 శాతం పడిపోయింది. మొదటి ఐదు నిమిషాల్లోనే 2 వేల 400 పాయింట్లకు పైగా పతనమైంది. వెంటనే ట్రేడింగ్ నిలిపేశారు. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌‌ను క్లోజ్ చేశారు.

రాష్ట్రపతితో భేటీ.. సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయా?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వివిధ దేశాల రాయబారులతో కూడా సమావేశం కానుంది ప్రభుత్వం. అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది కేంద్రం.

మిసైల్ టెస్ట్.. ఆపరేషన్ అరేబియన్ సీ..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మరింత దుందుడుకు చర్యలకు దిగింది. అరేబియా సముద్రంలో క్షిపణులను పరీక్షించబోతున్నామంటూ ప్రకటించింది. వెంటనే ఇండియన్ ఆర్మీ అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చింది. ఇండియన్ నావల్ షిప్ INS సూరత్‌ నుంచి తొలిసారిగా భూతలం నుంచి గాల్లోకి ప్రయోగించే మీడియం రేంజ్ మిసైల్‌ను పరీక్షించింది. ఇది సీ స్కిమ్మింగ్‌ టార్గట్స్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీస్కిమ్మింగ్‌ టార్గెట్స్ అంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనే దానిపై పరీక్షలు నిర్వహించింది ఇండియన్ నేవీ.

మెడికల్ వీసాలూ రద్దు..

మరోరైపు, ఈనెల 27 నుంచి పాకిస్తాన్ జాతీయులకు చెల్లుబాటు అయ్యే అన్ని రకాల వీసాలు రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఏప్రిల్ 29 నుంచి పాకిస్తాన్ జాతీయులకు వైద్య వీసాలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మెడికల్ వీసాదారులు ఈనెల 29 లోపు దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది.

Also Read : కల్మా అంటే ఏంటి? వాళ్లను ఉగ్రవాదులు ఎందుకు వదిలేశారంటే..

రూ. 20 లక్షల క్యాష్ అవార్డ్

కశ్మీర్‌ ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. కశ్మీర్‌ లోయను జల్లెడ పడుతున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలను రిలీజ్ చేసిన పోలీసులు.. వారి ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రూపాయలు క్యాష్ అవార్డ్ ప్రకటించారు.

Voice over
Anchor

Related News

New GST Rates: GST 2.O లో తగ్గిన వస్తువుల.. ధరల లిస్ట్ ఇదే

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Big Stories

×