Cherlapalli Railway Terminal: కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. చిన్నపాటి ఈదురు గాలులతో కూడిన వర్షానికే ధ్వంసం అయ్యింది. టెర్మినల్ లోని ఫాల్ సీలింగ్ సహా ఎలివేషన్ కుప్ప కూలింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి సౌత్ వైపు కొత్తగా నిర్మించిన మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర రూఫింగ్ షీట్లు కూలి కిందపడ్డాయి. ముఖ ద్వారం పై కప్పు ఎగిరిపోయింది. టెర్మినల్ లోపల పెద్ద మొత్తంలో ఫాల్ సీలింగ్ ఊడిపడింది. ఆ సమయంలో ప్రయాణీకులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే రైల్వే పోలీసులు, స్టేషన్ సిబ్బంది ప్రయాణీకులను అలర్ట్ చేశారు. కూలిన ప్రదేశాల వైపు వెల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు.
చిన్నపాటి వర్షానికి ఇలా అయితే ఎలా?
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల మీద ఉన్న ప్రయాణీకుల రద్దీ ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లిలో అత్యాధునిక రైల్వే టెర్మినల్ ను నిర్మించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను తగ్గించడంతో పాటు ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి అనుగుణంగా నగర శివార్లలో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. 428 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలపించేలా ఈ రైల్వే టెర్మినల్ ను తీర్చిదిద్దారు. మొత్తం రెండు అంతస్తులలో ఈ శాటిలైట్ టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ లో మొత్తం 9 ఫ్లాట్ ఫారమ్ లను నిర్మించారు. 19 రైల్వే లైన్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు నిర్మించారు. ప్రయాణీకులకు అనుకూలంగా గ్రౌండ్ ఫ్లోర్ లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వెయిటింగ్ హాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇంత అద్భుతంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ చిన్న గాలివానకే పలు చోట్ల విధ్వంసానికి గురికావడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు. హంగూ ఆర్భాటం తప్ప పనుల్లో క్వాలిటీ లేవని విమర్శలు చేస్తున్నారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్లో కూలిన ఫాల్ సీలింగ్
హైదరాబాద్లోని కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ గాలులదాటికి స్టేషన్ ముందు భాగంలో ఫాల్ సీలింగ్, ఎలివేషన్ విరిగి పడ్డాయి.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు… pic.twitter.com/Q2crkht81y
— ChotaNews App (@ChotaNewsApp) May 3, 2025
Read Also: ఓలా, ఉబర్, రాపిడోకు జరిమానా.. అమల్లోకి నయా క్యాబ్స్ పాలసీ!
హైదరాబాద్ లో వర్ష బీభత్సం
ఇక హైదరాబాద్ లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలి వాన ధాటికి చర్లపల్లి రైల్వే స్టేషన్ తో పలు ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. సికింద్రాబాద్ బౌద్ధనగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్లకు అడ్డంగా పెద్ద వృక్షాలు పడిపోవడంతో ప్రయాణీకులు, వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత భయానకమైన రైలు ప్రమాదం.. ఏకంగా 1700 మంది దుర్మరణం!