E-Paper
Advertisement

జస్ట్ 5 సెకన్లలో 800 కిమీ వేగం.. ఫ్యూచర్ బుల్లెట్ రైలు ఇదేనా?

జస్ట్ 5 సెకన్లలో 800 కిమీ వేగం.. ఫ్యూచర్ బుల్లెట్ రైలు ఇదేనా?
Advertisement

China Maglev Train Speed: చైనా మరోసారి హైస్పీడ్ రైలు టెక్నాలజీలో సత్తా చాటింది. ప్రయోగాత్మక దశలో ఉన్న మాగ్లెవ్ బుల్లెట్ రైలు వేగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రైలు కేవలం 5.3 సెకన్లలో 0 నుంచి గంటకు 800 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. గత ఆరు నెలల్లోనే ఈ ప్రయోగాత్మక రైలు తన రికార్డును మూడోసారి దాటేసింది.

5.3 సెకన్లలో 800 కిమీ వేగం

హుబే ప్రావిన్స్‌లోని డాంగ్‌హు ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన 1 కిలోమీటర్ టెస్ట్ ట్రాక్‌పై ఈ పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. సుమారు 1.1 టన్నుల బరువున్న ఈ చిన్న ప్రయోగాత్మక రైలు అత్యంత వేగంగా వేగాన్ని అందుకుంది.  గతంలో ఇదే రైలు గంటకు 798 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. అంతకంటే ముందు 2025 డిసెంబర్‌లో కేవలం రెండు సెకన్లలో గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని రికార్డు సృష్టించింది. 2025 జూన్‌ లో జరిగిన తొలి పరీక్షలో ఏడు సెకన్లలో గంటకు 650 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది.

సాధారణ మాగ్లెవ్ రైళ్ల కంటే ఎన్నో రెట్లు వేగం

Advertisement

ప్రస్తుతం చైనా, జపాన్ వంటి దేశాల్లో వాణిజ్య మాగ్లెవ్ రైళ్లు సాధారణంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. చైనాలోని అత్యంత వేగవంతమైన కమర్షియల్ హైస్పీడ్ రైలు సేవలు సుమారు 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. అయితే, తాజాగా పరీక్షించిన ప్రయోగాత్మక మాగ్లెవ్ రైలు వీటితో పోలిస్తే చాలా ఎక్కువ వేగాన్ని సాధించింది. ఇది భవిష్యత్తులో రైలు రవాణా వేగాన్ని ఎలా మార్చబోతుందో చెప్పేసింది.

మాగ్లెవ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

మాగ్లెవ్ అంటే ‘మాగ్నెటిక్ లెవిటేషన్’. సాధారణ రైళ్లలో చక్రాలు పట్టాలను తాకుతూ ముందుకు వెళ్తాయి. కానీ, మాగ్లెవ్ వ్యవస్థలో అయస్కాంత శక్తిని ఉపయోగించి రైలును పట్టాలపై నుంచి కొంత ఎత్తులో నిలిపి ఉంచుతారు. దీంతో చక్రాలు, పట్టాల మధ్య ఉండే ఘర్షణ చాలా వరకు తొలగిపోతుంది. పట్టాల వెంట ఏర్పాటు చేసిన ప్రత్యేక కాయిల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే అయస్కాంత శక్తి రైలును ముందుకు నడిపిస్తుంది. అధిక వేగంలో స్థిరత్వం కోసం టెస్ట్ ట్రాక్‌ ను కూడా అత్యంత కచ్చితంగా నిర్మిస్తారు.

వేగం మాత్రమే కాదు.. బ్రేకింగ్ కూడా కీలకం

Advertisement

ఈ ప్రయోగంలో రైలు వేగాన్ని పెంచడమే కాకుండా దాన్ని సురక్షితంగా తగ్గించే సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. గంటకు 800 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న తర్వాత వాహనం నియంత్రితంగా వేగాన్ని తగ్గించుకుని సుమారు 200 మీటర్ల దూరంలో పూర్తిగా ఆగినట్లు నివేదికలు వెల్లడించాయి. అధిక వేగంతో ప్రయాణించే వ్యవస్థల్లో బ్రేకింగ్, నియంత్రణ వ్యవస్థలు చాలా కీలకం కావడంతో ఈ పరీక్షకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.  భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీ రైలు రవాణాతో పాటు అంతరిక్ష ప్రయోగాలు, ఇతర అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థల్లో ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

Read Also: వందే భారత్ కార్గో రైలు వచ్చేస్తోంది, స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tags

Related News

మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

Big Stories

Advertisement
×