E-Paper
Advertisement

హైదరాబాద్ ప్రజలకు షాకింగ్ న్యూస్.. టిఫిన్ సెంటర్లు బంద్!

హైదరాబాద్ ప్రజలకు షాకింగ్ న్యూస్.. టిఫిన్ సెంటర్లు బంద్!
Advertisement

Breakfast: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఎవరూ కూడా అర్థాకలితో అలమటించరాదన్న మహా సంకల్పంతో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ.5 కే అందుబాటులోకి తీసుకొచ్చిన టిఫిన్ కార్యక్రమం ప్రారంభించిన 50 టిఫిన్ సెంటర్ల వద్దనే ఆగిపోయింది. అంతకు ముందు కేవలం రూ. 5 కే భోజనాన్ని అందించేందుకు అమల్లోకి తీసుకువచ్చిన అన్నపూర్ణ స్కీమ్ కు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చి అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.

ఈ 50 టిఫిన్ సెంటర్లు..

మధ్యాహ్నాం పూట రూ. 5 కే భోజనాన్ని పంపిణీ చేసే కేంద్రాల్లోనే ఉదయం రూ.5 కే చిరుధాన్యాలతో కూడిన టిఫన్ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు గత సంవత్సరం ఆగస్టు మాసంలోనే జల్లా ఇన్ ఛార్జి మంత్ర పొన్నం ప్రభాకర్, అప్పటి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలు ఎంతో ఆర్బాటంగా టిఫిన్ సెంటర్లను ప్రారంభించిన సంగతి తెల్సిందే. తొలు కొద్ది ప్రాంతాల్లో ఈ 50 టిఫిన్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు, క్రమంగా వీటి సంఖ్య రానున్న ఏడాదిలోనే వందకు పెంచనున్నట్లు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించి ఏడాది గడిచిపోయినా, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఒక్క టిఫిన్ సెంటర్ ను కూడా ప్రారంభించలేదు.

ముఖ్యంగా సిటిలో..

Advertisement

చాలా ప్రాంతాల్లోని జీహెచ్ఎంసీ, కాలనీ పార్కుల్లో మార్నింగ్ వాక్ కోసం వస్తున్న వాకర్లు కేవలం రూ. 5 కే టిఫిన్ స్టాళ్లను పార్కులకు సమీపంలో ప్రారంభించాలని వినతులు కూడా సమర్పించినా ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏ మాత్రం చొరవ చూపటం లేదు. ముఖ్యంగా సిటిలో అత్యధిక మంది రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు వాకింగ్ కు వచ్చే కేబీఆర్ పార్కుకు సమీపంలో ఈ చిరుధాన్యాలతో సరఫరా చేస్తున్న టిఫిన్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు విన్పించాయి. కానీ గత సంసత్సరం ప్రారంభించిన టిఫిన్ సెంటర్లే తప్పా, జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు అదనంగా ఒక్క టిఫిన్ సెంటర్ ను ఏర్పాటు చేయలేదు.

Also Read: ఏపీకి గట్టి షాకిచ్చిన తెలంగాణ.. కృష్ణా నీళ్ల పంపకాలపై షాకింగ్ ట్విస్ట్!

జీహెచ్ఎంసీ ఆలోచన..

Advertisement

ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో యాంత్రికమైపోతున్న మానవ జీవితంలో అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో కనీసం ఉదయమైనా చక్కటి ఆరోగ్యకరమైన టిఫిన్ అందించాలన్న జీహెచ్ఎంసీ ఆలోచన మహోన్నతమైనదే గానీ మొత్తం క్యూర్ సిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు టిఫిన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తే సంకల్పం నూటికి నూరు శాతం నెరవేరినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి వార్డుకు ఒక ఇందిరమ్మ క్యాంటీన్ ఉండేలా సమగ్ర కార్యాచరణను సిద్దం చేస్తున్నామని ప్రకటించిన అధికారులు ఏఢాది క్రితం కేవలం 50 టిఫిన్ సెంటర్లు ప్రారంభించి, చేతలు దులుపుకున్నారన్న విమర్శ వెల్లువెత్తుతుంది.

వ్యయ భారం ఇలా..

రోజూ మధ్యాహ్నాం రూ.5కే భోజనం, ఉదయం రూ.5 కే బ్రేక్ ఫాస్ట్ ను అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్ల కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఔటర్ వరకు విస్తరించేందుకు అధికారులు చేసిన కసరత్తు మధ్యలోనే ఆగిపోయినట్లు సమాచారం. పేదలకు తక్కువ ధరకే భోజనం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో రూ.5 కే అన్నపూర్ణ భోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పట్లో నాంపల్లి రైల్వే స్టేషన్‌ లో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని పేదలు, కూలీలు, వివిధ పనుల మీద నగరానికి వచ్చేవారికి తక్కువ ధరలో భోజనం అందించాలనేది లక్ష్యంతో పథకం ప్రారంభించి నగర వ్యాప్తంగా 139 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Also Read: లేడీ గెటప్స్ వెనుక శాంతి స్వరూప్ కన్నీటి కథ.. అసలు కారణం ఇదే!

డైలీ సుమారు 30 వేల మంది..

ప్రస్తుతం వీటిని ఆధునీకరించి 159 కి పెంచారు. కొన్ని కేంద్రాల్లో లబ్దిదారులు కూర్చోని భోజనం చేసేలా సిట్టింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించినా, చాలా సెంటర్లలో ఉదయం టిఫిన్ పంపిణీ చేయటం లేదని తెల్సింది. ఈ కేంద్రాలు డైలీ సుమారు 30 వేల మంది భోజనం అందిస్తున్నాయి. మొదటగా కేవలం 5 రూపాలయలకే అందించే భోజనంలో 400 గ్రాముల అన్నం , 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల కర్రీ, 15 గ్రాముల పచ్చడి అందిస్తున్నారు. ఒక్కో ప్లేటు భోజనానికి రూ.34 ఖర్చు అవుతుండగా, ఇందులో లబ్ధిదారులు రూ.5 చెల్లిస్తుండగా, మిగిలిన రూ.29లలో కొంత వరకు హరేరామ హరే కృష్ణ మూవ్ మెంట్ భరిస్తుంది. ఈ పథకం కోసం జీహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం దాదాపు రూ.15 కోట్లను ఎప్పటికపుడు బడ్జెట్ లో కేటాయింపులు జరుపుతుంది.

ఉదయం ఏడు గంటల నుంచి..

రూ. 5 కే భోజనం స్కీమ్ సక్సెస్ కావడంతో రూ.5 బ్రేక్ ఫాస్ట్ అందించే పథకాన్ని గతేడాది నుంచి ప్రారంభించారు. ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీ, పొంగల్ వంటి టిఫిన్లు ప్రతీ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రూ. 5 కే అందిస్తున్నారు. ఒక్క ప్లేటు బ్రేక్ ఫాస్ట్ కి రూ.19 ఖర్చు అవుతుండగా, ఇందులో రూ.5 లబ్దిదారుల నుంచి కలెక్ట్ చేస్తుండగా, మిగతా రూ.14 జీహెచ్ఎంసీ భరిస్తున్నట్లు సమాచారం. దాదాపు పదమూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల కంటైనర్లలో చాలా వరకు తప్పుబట్టి ఉన్నట్లు, మరి కొన్ని టిఫిన్ సెంటర్లలో ముందు ప్రకటించిన మెనూను పక్కన బెట్టి కేవలం ఇడ్లీ, ఉప్మాలు మాత్రమే వడ్డిస్తున్నట్లు, ఇందుకు నిర్వాహణ లోపమే కారణమని లబ్దిదారులు వాదిస్తున్నారు.

Also Read: మల్లారెడ్డీ.. దమ్ముంటే రాజీనామా చెయ్! తోటకూర వజ్రేష్‌యాదవ్‌ సవాల్

Tags

Related News

హైదరాబాద్ ల్యాండ్ ఓనర్లకు షాకింగ్ న్యూస్.. హెచ్‌ఎమ్‌డీఏ, టీడీఆర్‌లలో సంచలన మార్పులు!

రామ‌న్న ఎమ్మెల్సీ వ్యూహం! న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల‌కు సంఘీభావం.. గ్రాడ్యూయేట్ ఎన్నిక‌ల వేళ యువ‌త‌కు ద‌గ్గ‌ర‌య్యే వ్యూహం..

మరో కొత్త దందాకు తెరలేపిన రైస్ మిల్లర్లు.. సీఎంపైనే ఎదురుదాడికి దిగుతారా..!

విలేక‌రి ప్ర‌శ్న‌కు.. అర్వింద్ బేవ‌కూఫ్ దాడి .. లీడ‌ర్ల‌ను తిట్టి తిట్టీ అల‌వాటైన దోర‌ణిలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ..

రాజంపేటలో నల్లారి చాప్టర్ క్లోజ్? బిజెపి మాస్టర్ ప్లాన్ ఇదే!

శ్రీకాకుళంలో భారతమాతే గ్రామదేవత.. కపాసుకుద్ది ఆలయ చరిత్ర ఇదే!

న్యాయ విద్యార్థుల పోరాటమా లేక రాజకీయ కుట్రమా.. నల్సార్ వివాదంపై దేశవ్యాప్తంగా రచ్చ!

Big Stories

Advertisement
×