E-Paper
Advertisement

వందే భారత్ కార్గో రైలు వచ్చేస్తోంది, స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

వందే భారత్ కార్గో రైలు వచ్చేస్తోంది, స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

New Vande Bharat Cargo Train: భారత రైల్వేలో సరుకు రవాణా మరింత వేగంగా కొనసాగే దిశగా మరో కీలక అడుగు పడింది. దేశంలో తొలిసారిగా రూపొందించిన వందే భారత్ సరుకు రవాణా రైలు ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. రాజస్థాన్‌లోని కోటా–నాగ్దా–సవాయి మాధోపూర్ రైల్వే మార్గంలో నిర్వహించిన ట్రయల్ రన్‌ లో ఈ రైలు గంటకు 145 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీసింది. ఈ పరీక్షల్లో రైలు వేగంతో పాటు భద్రత, బ్రేకింగ్ వ్యవస్థ, పట్టాలపై రైలు పనితీరు లాంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

చెన్నైలో తయారీ

ఈ ప్రత్యేక సరుకు రవాణా రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. మొత్తం 16 కోచ్‌లతో ఈ మోడల్   రైలును రూపొందించారు. ఢిల్లీ–ముంబై రైల్వే కారిడార్‌లో రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతున్నాయి. సాధారణ ప్రయాణికుల రైళ్లకు భిన్నంగా సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించడంతో, వేగంగా సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం సాధ్యం కానుంది.

160 కిలోమీటర్ల వేగం

Advertisement

వందే భారత్ సరుకు రవాణా రైలును గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. అయితే ఒకేసారి గరిష్ట వేగంతో పరీక్షించకుండా దశలవారీగా వేగాన్ని పెంచుతున్నారు. మొదట గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత 130, 135, 145 కిలోమీటర్ల వేగాలను పరీక్షిస్తున్నారు. ప్రతి దశలో రైలు పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా అధిక వేగంలో బ్రేకులు ఎంత సమర్థంగా పనిచేస్తాయనే అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

395 టన్నుల సరుకు సామర్థ్యం

ఈ రైలులో సరుకు మోసే సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంది. మొత్తం 395 టన్నుల వరకు పేలోడ్‌ను తరలించే అవకాశం ఉంది. మొత్తం 14 వ్యాగన్లు ఉన్నాయి. ఒక్కో వ్యాగన్ 25 టన్నుల సరుకును మోసే సామర్థ్యంతో అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో రైలుకు సంబంధించిన రెండు డ్రైవర్ ట్రైలర్ వ్యాగన్లు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి 20 టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో భారీ మొత్తంలో సరుకును వేగంగా తరలించే అవకాశం ఉంటుంది.

సాధారణ రైళ్ల కంటే వేగంగా

Advertisement

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న సంప్రదాయ సరుకు రవాణా రైళ్లు సాధారణంగా గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే, వందే భారత్ సరుకు రవాణా రైలు సగటు వేగం గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఉండేలా రూపొందించారు. దీంతో సరుకు రవాణా సమయం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ–ముంబై వంటి కీలక రైల్వే మార్గాల్లో వేగవంతమైన సరుకు రవాణాకు ఇది ఉపయోగపడనుంది. దేశంలో సరుకు రవాణా వేగాన్ని పెంచడం ద్వారా పరిశ్రమలు, వ్యాపార రంగానికి కూడా లాభం కలగనుంది.

Read Also: ఇక మరింత సౌకర్యవంతంగా లోకల్ రైళ్లు.. వందే మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Tags

Related News

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!

Big Stories

Advertisement
×