Instant Energy: ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత పోషకాహారం తినడంతో పాటు 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఆహారం, నిద్ర పట్ల జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంత మంది రోజంతా నీరసంగా, శక్తి తక్కువగా ఉన్నట్లు కనిపిస్తారు. మీకు కూడా ఇలా జరుగుతుంటే.. మీ శరీరంలో పోషకాహార లోపం, నీరు లేకపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు లేదా కెఫిన్ అధికంగా తీసుకోవడం వంటి కారణాల్లో ఏది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందో గుర్తించండి.
ఇదే కాకుండా మీరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా కూడా.. త్వరగా అలసిపోతారు ఈ కారణాల వల్ల మీరు ఏ పనిపై దృష్టి పెట్టలేరు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమయంలోనే మీరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిఇంట్లో తయారు చేసిన డ్రింక్స్ తాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అంతే కాకుండా ఈ డ్రింక్స్ మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి. కాబట్టి మీ అలసటను తొలగించడంలో సహాయపడే డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరి నీళ్లు, మజ్జిగ:
రాత్రి 7 నుండి 8 గంటలు నిద్ర పోయిన తర్వాత కూడా మీకు రోజంతా నీరసంగా అనిపిస్తే.. కొబ్బరి నీళ్లు, మజ్జిగ మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా ఇవి ఎలక్ట్రోలైట్ల లోపాన్ని కూడా భర్తీ చేస్తుంది. తద్వారా అలసట తగ్గుతుంది. మజ్జిగ తీసుకోవడం ద్వారా.. జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ శరీరంలోని శక్తిని కాపాడుతుంది.
2. బెల్లం, సోంపు నీరు:
బెల్లంలో ఉండే ఖనిజాలు శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా అలసటను తొలగిస్తాయి. సోంపు జీర్ణక్రియను బలపరుస్తుంది. ఇది రోజంతా శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. ప్రతి ఉదయం గోరు వెచ్చని నీటితో సోంపు, బెల్లం కలిపి తినండి. ఇలా తాగడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా నీరసంగా అనిపించినప్పుడు ఈ డ్రింక్ తాగడం అలవాటు చేసుకోండి.
3. నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష :
బాదం, ఎండుద్రాక్షలలో విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా బాదం, ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టి తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు పెరుగుతాయి. వీటిని తినడం ద్వారా.. శరీరంలోని రక్త పరిమాణం పెరుగుతుంది. అంతే కాకుండా శరీరంలో శక్తి స్థాయి మెరుగుపడుతుంది.
4. ఉసిరి, తులసి రసం:
ఉసిరి విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం. ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో, అంతే కాకుండా జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. తులసి రసంలో యాంటీ-ఆక్సిడెంట్ అంశాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని డీ హైడ్రేట్ చేయడానికి పనిచేస్తాయి. తద్వారా శరీరం నుండి అలసటను తొలగిస్తాయి. రోజంతా శక్తిని నిలబెట్టుకోవడానికి.. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా ఉసిరి రసంతో పాటు తులసి రసం కలిపి త్రాగాలి.
Also Read: పెళ్లి తర్వాత.. ఎందుకు బరువు పెరుగుతారో తెలుసా ?
5. ఖర్జూరాలు, పాలు తినండి:
ఖర్జూరాలు సహజ శక్తిని పెంచేవి. ఇవి అలసట , బలహీనతను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా పాలలో ఉండే కాల్షియం, విటమిన్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కాబట్టి, రాత్రి పడుకునే ముందు.. గోరు వెచ్చని పాలలో 2 నుండి 3 ఖర్జూరాలను కలిపి త్రాగాలి. ఇది మీ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా రోజంతా తాజాగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది.