BigTV English

Milk – Non Vegetarian: పాలు మాంసాహారమా? అమెరికాలో అంతే.. ఎందుకంటే?

Milk – Non Vegetarian: పాలు మాంసాహారమా? అమెరికాలో అంతే.. ఎందుకంటే?

Milk: భారతీయులు పాలను ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. పాల ద్వారా బోలెడు పాల పదార్థాలు తయారు చేస్తారు. పాలను సాధారణంగా భారతీయులు స్వచ్ఛమైన శాఖాహారంగా భావిస్తారు. కానీ, అమెరికాలో ఓ కొత్త చర్చ జరుగుతుంది. అక్కడ పాలను మాంసాహారంగా భావిస్తున్నారట. దానికి ఓ కారణం ఉందంటున్నారు అక్కడ జనాలు. అమెరికాలో ఆవులు కొన్నిసార్లు జంతువుల ఆధారిత ఆహారాన్ని తింటాయి. దీని కారణంగా మాంసాహారంగా పిలుస్తున్నారు.


అమెరికాలో ఆవులు ఏం తింటాయి?

అమెరికా ఆవులు వేగంగా పెరగడానికి, ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడానికి అనేక పాడి ఆవులకు జంతువుల సంబంధ ఆహారాన్ని అందిస్తారు. జంతువుల మాంసం, ఎముకల నుంచి తయారు చేసిన ఉత్పత్తులను ప్రొటీన్ కోసం ఉపయోగిస్తారు. జంతువుల రక్తాన్ని ఎండబెట్టి అదనపు పోషకాల కోసం యాడ్ చేస్తారు. చేపలకు సంబంధించిన ప్యాట్స్ ను ప్రొటీన్ కోసం జంతువులకు అందిస్తారు. ఆవులకు ఎక్కువ ఎనర్జీ ఇవ్వడానికి జంతువుల కొవ్వును అందిస్తారు. ఫౌల్ట్రీ వ్యర్థాలను కూడా దాణాగా ఉపయోగిస్తారు. మాంసాహార సంబంధ ఉత్పత్తులను ఆవులకు ఇస్తారు కాబట్టి, అమెరికాలో పాలను మాంసాహారంగా భావిస్తున్నారు.


 మన దేశంలో పాలను ఎంతో స్వచ్ఛమైనవి

మన దేశంలో ఆవులను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. పాలను స్వచ్ఛమైన శాఖాహార ఆహారంగా భావిస్తారు. మన దేశంలో ఆవులు గడ్డి, చెరకు, ధాన్యాలు లాంటి మొక్కల ఆధారిత ఆహారాలను మాత్రమే తింటాయి. అమెరికా  ఆవులు జంతు సంబంధ ఉత్పత్తులను తింటాయి. అక్కడ కొంత మంది పాలను మాంసాహారం అని పిలుస్తారు. వారు అక్కడ పాలను స్వచ్ఛమైనవిగా భావించరు. అందుకే, భారత్ అమెరికా నుంచి పాల దిగుమతిని అనుమతించడం లేదు. మనకు ఆ పాలు సూట్ కావని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పాలు నిజంగా మాంసాహారమా?

శాస్త్రీయంగా పాలు ఇప్పటికీ శాఖాహారమే. ఎందుకంటే, పాలు ఆవు శరీరం నుంచి వస్తాయి. ఆవు ఏమి తింటుందో బట్టి ఇవి పెద్దగా మారవు. ఆవులు మేపిన జంతువుల ఉత్పత్తుల నుంచి వచ్చే పాలు తాగడానికి సురక్షితమని నిపుణులు వెల్లడిస్తున్నారు. అమెరికా నియమాలు  పాలను శుభ్రంగా, హానికరమైన పదార్థాలు లేకుండా చూస్తాయి.  అయినప్పటికీ, మనదేశంలో చాలా మంది మన పాలనే శాఖాహారంగా భావిస్తున్నారు.

Read Also: డిమార్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన, ఇదేం కొత్త పంచాయితీ సామీ!

ఆవులకు జంతువుల  ఉప ఉత్పత్తులను తినిపించడం ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. కొద్ది సంవత్సరాల క్రితం, ఇలాంటి  దాణా పద్ధతుల కారణంగా పిచ్చి ఆవు వ్యాధి సంభవించింది. ఈ నేపథ్యంలో US ఇప్పుడు కఠినమైన నియమాలను అమలు చేస్తుంది. ఆవులు సహజంగా మొక్కలను తింటాయి. కాబట్టి, ఆవులకు జంతు ఉత్పత్తులను తినిపించడం తప్పని కొందరు భావిస్తారు. ఇది ఆవులకు మంచిది కాదంటున్నారు.

Read Also: వామ్మో.. ఈ వంట పాత్రలు అంత డేంజరా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!

Related News

Glow Skin In One Day: ఇవి వాడితే.. ఒక్క రోజులోనే గ్లోయింగ్ స్కిన్

Blood Sugar: ఏంటీ.. టూత్ పేస్ట్‌‌తో షుగర్ పెరుగుతుందా ?

Goat Milk Benefits: మేక పాలు తాగితే.. మతిపోయే లాభాలు, తెలిస్తే అస్సలు వదలరు !

Chai-Biscuit: చాయ్‌తో బిస్కెట్ తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు

Tomato Pulao: క్షణాల్లోనే రెడీ అయ్యే టమాటో పులావ్.. తింటే మైమరచిపోతారు !

Mushroom Curry: మష్రూమ్ కర్రీ.. సింపుల్‌గా ఇలా చేసేయండి !

Kidneys: మీలో ఈ అలవాట్లున్నాయా ? వెంటనే మానేయండి !

Almonds Side Effects: ఆరోగ్యానికి మంచివని బాదం ఎక్కువగా తింటున్నారా ? ఈ సమస్యలు తప్పవు !

Big Stories

×