E-Paper
Advertisement

గగనతనంలో గల్లి చాయ్.. ఎయిర్ ఇండియా సరికొత్త ప్రయోగం!

గగనతనంలో గల్లి చాయ్.. ఎయిర్ ఇండియా సరికొత్త ప్రయోగం!
Advertisement

Air India Introduces Cutting Chai: రైల్వే స్టేషన్‌ లోనో, రోడ్డు పక్కన టీ స్టాల్ దగ్గరో నిలబడి చిన్న గ్లాసులో వేడి వేడి కటింగ్ చాయ్ తాగడం చాలామందికి క్రేజీ ఎక్స్ పీరియెన్స్. ఇప్పుడు అదే అనుభూతిని ఆకాశంలో కూడా అందించేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమైంది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే ఫస్ట్, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ‘కటింగ్ చాయ్’ని అందించాలని నిర్ణయించింది. అదీ మసాలా ఫ్లేవర్ తో ఆకట్టుకోబోతోంది. విమాన ప్రయాణంలో సాధారణంగా లభించే టీకి భిన్నంగా,  రోజువారీ జీవితంలో భాగమైన కటింగ్ చాయ్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయడం ఈ ప్రయత్నంలోని ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు.

ప్రత్యేకంగా  తయారు చేసిన మసాలా చాయ్

ఈ చాయ్‌ను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL) సహకారంతో అభివృద్ధి చేశారు. ఎయిర్ ఇండియా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ డ్రింక్ దేశంలోని టీ స్టాల్స్‌ లో లభించే కటింగ్ చాయ్ నుంచి ప్రేరణ పొందింది. మసాలా రుచితో ఉండే ఈ టీని విమానంలోనే తాజాగా తయారు చేసి ప్రయాణికులకు అందిస్తారు. సంప్రదాయ కటింగ్ చాయ్‌ను గుర్తు చేసేలా చిన్న, సింగిల్ సర్వ్ పరిమాణంలో అందించడం మరో ప్రత్యేకత.

చిన్న గ్లాస్‌ లో పెద్ద జ్ఞాపకం!

Advertisement

కటింగ్ చాయ్ అనేది కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు. స్నేహితులతో మాట్లాడుకుంటూ టీ తాగడం, ప్రయాణంలో మధ్యలో టీ కోసం ఆగడం, రద్దీగా ఉన్న వీధి టీ స్టాల్ దగ్గర వేడి చాయ్ ఆస్వాదించడం లాంటి ఎన్నో జ్ఞాపకాలతో దీనికి సంబంధం ఉంటుంది. అలాంటి రుచిని విమానంలో అందించడం ద్వారా భారతీయ ప్రయాణికులకు తమకు తెలిసిన వాతావరణాన్ని గుర్తు చేయాలనేది ఎయిర్ ఇండియా ఉద్దేశం. విదేశీ ప్రయాణికులకు మాత్రం భారతీయ జీవనశైలిలో సాధారణంగా కనిపించే రుచిని పరిచయం చేసే అవకాశం లభిస్తుంది.

కటింగ్ చాయ్‌కు APEX అవార్డు

ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ డ్రింక్ కు ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచి కూడా గుర్తింపు లభించింది. కటింగ్ చాయ్ ఎయిర్‌లైన్ ప్యాసింజర్ ఎక్స్‌పీరియన్స్ అసోసియేషన్ (APEX) నుంచి ‘బెస్ట్ ఆన్‌బోర్డ్ బెవరేజ్ (హాట్)’ అవార్డును అందుకుంది. విమానంలో ప్రయాణికులకు అందించే ఫుడ్, డ్రింక్స్ కూడా మొత్తం ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ లో భాగంగా మారుతున్న సమయంలో ఈ అవార్డు రావడం ప్రత్యేకంగా నిలిచింది.

ప్రీమియం ప్రయాణంలో ఇండియన్ టచ్

Advertisement

ఎయిర్ ఇండియా ప్రస్తుతం క్యాబిన్ ఇంటీరియర్స్, సర్వీస్, ఫుడ్ అండ్ బెవరేజ్ లాంటి ప్రయాణికుల అనుభవానికి సంబంధించిన అనేక అంశాల్లో మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో భారతీయ రుచులు, సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందిన డ్రింక్స్ కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ముంబై వీధుల్లో చిన్న గ్లాసులో కనిపించే కటింగ్ చాయ్.. ఇప్పుడు అంతర్జాతీయ విమానంలో ప్రీమియం ప్రయాణికుల టేబుల్‌పైకి రావడం భారతీయ రుచుల లెవల్ ను మరో స్థాయికి చేర్చినట్లు అయ్యింది.

Read Also: కదిలే రైల్లో అదిరిపోయే కేఫే.. వేడి కాఫీ తాగుతూ వెళ్తుంటే ఆ కిక్కే వేరప్పా!

Tags

Related News

నిందితుల కోసం కదులుతున్న కారుపైకి దూకిన పోలీస్.. ఏకంగా 40 కిలో మీటర్లు కళ్లు చెదిరే ఛేజ్!

బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!

కొరియాలో పార్సిల్స్ టేప్స్ మీద పిల్లల ఫోటోస్ ఎందుకు ఉంటాయో తెలుసా? భలే ఐడియా!

నార్మల్ ప్యాసింజర్ లా వెళ్తూ.. రైలులో సివిక్ సెన్స్ లేని వాళ్లకి మొట్టికాయలు వేసిన ఆదా శర్మ!

కదిలే రైల్లో అదిరిపోయే కేఫే.. వేడి కాఫీ తాగుతూ వెళ్తుంటే ఆ కిక్కే వేరప్పా!

రాత్రివేళ లాంగ్ డ్రైవ్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి

ప్రపంచంలో వింతైన రైళ్లు.. వీటి ప్రయాణం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×