Rinku Singh Injury: టీమిండియా (Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England ) మధ్య ఐదు టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో మూడు మ్యాచ్లు పూర్తీ అయ్యాయి. ఇందులో రెండు టీం ఇండియా గెలువగా మరొక మ్యాచ్ ఇంగ్లాండు గెలిచింది. అయితే… మూడవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవడంతో టీమిండియా (Team India ) వైఫల్యాలు అన్ని బయటపడ్డాయి. ఆరు లేదా ఏడవ వికెట్ కు వచ్చే ఆటగాడు… హిట్టింగ్ చేయడంలో విఫలం కావడం జరిగింది.
Also Read: Navjot Singh Sidhu: 33 కేజీలు తగ్గిన టీమిండియా ప్లేయర్.. ఆ వ్యాధి సోకిందా ?
జూరెల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా… అలాగే అక్షర్ పటేల్ ఇలా ఎవరు కూడా డౌన్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయలేక విఫలమయ్యారు. అయితే రింకు సింగ్ ఉంటే మూడవ టి20 లో ఈ పరిస్థితి ఉండేది కాదని అందరూ చర్చించుకుంటున్నారు. గాయం కారణంగా రెండు అలాగే మూడవ టి20కి దూరమయ్యాడు రింకు సింగ్. రింకు సింగ్ తో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా దూరం కావడం జరిగింది.
జనవరి 31 అంటే రేపు… టీమిండియా (Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో t20 జరగనుంది. పూణే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో రింకు సింగ్ ( Rinku Singh ) అందుబాటులోకి రాబోతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్ కూడా ప్రకటన చేశారు. రింకు సింగ్ రేపటి మ్యాచ్లో టీమిండియాలోకి రావడంతో… మిడిల్ ఆర్డర్ బలంగా మారబోతుంది. ఎలాంటి సిచువేషన్ లో అయిన రింకు సింగ్ బ్యాటింగ్ చేయగలడు.
హార్డ్ హిట్టింగ్ చేయగల రింకు సింగ్ ( Rinku Singh ) …. జట్టులోకి వస్తే జూరెల్ పైన వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రింగు సింగ్ జట్టులోకి వచ్చిన తర్వాత ఆరవ వికెట్… కు బరిలోకి దిగబోతున్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ ను కూడా ఈ మ్యాచ్లో పక్కకు పెట్టే ఛాన్స్ ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో రమన్దీప్ సింగ్ బరిలో ఉంటాడు. అటు మహమ్మద్ షమీ కూడా నాల్గవ మ్యాచ్లో ఆడబోతున్నాడు. ఇక అటు ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లండ్ ప్రాక్టీస్ చేయలేదు. మూడో టీ20లో జేమీ స్మిత్ గాయంతో నిష్క్రమించడంతో అతని స్థానంలో జాకబ్ బెతెల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వుడ్ లేదా ఆర్చర్ లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి సాకిబ్ మహమూద్ ను ఆడించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.
Also Read: Shadab Khan: హీరోయిన్లకు అసభ్యకరమైన మెసేజ్ లు.. పాకిస్థాన్ ప్లేయర్ అరాచకం !
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/ రమణ్దీప్ సింగ్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జేమీ స్మిత్/ జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.
Rinku Singh was rested from the 2nd and 3rd T20I against England after sustaining a low back spasm.#INDvsENG #RinkuSingh #CricketTwitter pic.twitter.com/KlsoC1IAwX
— InsideSport (@InsideSportIND) January 30, 2025