E-Paper
Advertisement

ఇంత కాలం విమానాలు.. ఇప్పుడు రైళ్లు.. ఎతిహాద్ ప్లాన్ అదిరింది భయ్యా!

ఇంత కాలం విమానాలు.. ఇప్పుడు రైళ్లు.. ఎతిహాద్ ప్లాన్ అదిరింది భయ్యా!
Advertisement

Etihad Rail Passenger Train: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లో రైలు ప్రయాణం మరింత విస్తరించబోతోంది. ఎతిహాద్ రైల్ ప్రారంభించిన ప్యాసింజర్ రైలు సేవలు ఇప్పటికే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అబుదాబి నుంచి ఫుజైరా వరకు రైలు సర్వీస్ నడుస్తుండగా, త్వరలో దుబాయ్, షార్జా సహా మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

జూన్ 30న ఎతిహాద్ రైలు సర్వీసులు ప్రారంభం

ఎతిహాద్ రైల్ ప్యాసింజర్ రైలు సేవను జూన్ 30న అధికారికంగా ప్రారంభించింది. తొలి దశలో అబుదాబి-ఫుజైరా మధ్య రైలు సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం కేవలం గంట 45 నిమిషాల్లో పూర్తవుతుంది. దీంతో రోడ్డు మార్గంలో ఎక్కువ సమయం పట్టే ప్రయాణాలకు ఆల్టర్నేట్ గా రైలు సర్వీసులు ఉపయోగపడుతున్నాయి.

‘ప్రాజెక్ట్స్ ఆఫ్ ది 50’లో భాగంగా..

Advertisement

2021లో యూఏఈ ప్రభుత్వం ‘ప్రాజెక్ట్స్ ఆఫ్ ది 50’ కార్యక్రమంలో భాగంగా రైల్వే ప్రాజెక్టును ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే ప్రయాణికుల కోసం రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఎతిహాద్ రైల్ ప్యాసింజర్ నెట్‌వర్క్ ద్వారా యూఏఈలోని 11 నగరాలు, ప్రాంతాలను లింక్ చేయాలని భావిస్తోంది. ఇందులో అబుదాబి, దుబాయ్, షార్జా, ఫుజైరా, అల్ సిలా, అల్ ధన్నా, అల్ మిర్ఫా, మదీనత్ జాయెద్, మెజైరా, అల్ ఫయా, అల్ ధైద్ ప్రాంతాలు ఉన్నాయి.

దుబాయ్, షార్జా రైలు సర్వీసుల ప్రారంభం ఎప్పుడు?

అన్ని ప్రాంతాలకు ఒకేసారి కాకుండా దశలవారీగా ప్యాసింజర్ రైలు సేవలను ప్రారంభించనున్నట్లు ఎతిహాద్ రైల్ వెల్లడించింది. దుబాయ్, అల్ ధైద్ స్టేషన్లు 2026 సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత లివా, మదీనత్ జాయెద్ స్టేషన్లు నవంబర్ 30, 2026న అందుబాటులోకి రానున్నాయి. అల్ ధఫ్రా ప్రాంతంలోని మిగిలిన స్టేషన్ డిసెంబర్ 30, 2026న ప్రారంభం కానుంది. ఇక షార్జా స్టేషన్ సేవలు 2027 మార్చి 30 నుంచి ప్రారంభం కావచ్చని ఎతిహాద్ తెలిపింది. ఈ స్టేషన్లు అందుబాటులోకి వస్తే యూఏఈలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత ఈజీ కానుంది. ముఖ్యంగా ఉద్యోగులు, కుటుంబాలతో ప్రయాణించే వారు, పర్యాటకులకు మరింత ఉపయోగపడే అవకాశం ఉంది.

70 వేలకుపైగా టికెట్ల విక్రయం

Advertisement

ప్యాసింజర్ రైలు సేవలకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్టు 3 నాటికి ఎతిహాద్ రైల్ 70,000కు పైగా టికెట్లను విక్రయించినట్లు తెలిపింది. ప్రయాణికులు తమ టికెట్లను సగటున 12 రోజుల ముందుగానే బుక్ చేసుకుంటున్నారని సంస్థ వెల్లడించింది. రైలు సేవలను కేవలం కొత్త ప్రయాణ అనుభవంగా మాత్రమే కాకుండా, ఉద్యోగ, కుటుంబ, విహార ప్రయాణాల్లో భాగంగా కూడా ప్రజలు ఉపయోగించుకోవడం ప్రారంభించారని ఎతిహాద్ రైల్  తెలిపింది.

200 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణం

ప్రస్తుతం అబుదాబి-ఫుజైరా మార్గంలో నడుస్తున్న ప్యాసింజర్ రైలు గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎతిహాద్ రైల్ ప్యాసింజర్ రైలు సముదాయంలో మొత్తం 13 రైళ్లు ఉన్నాయి. ఒక్కో రైలులో సుమారు 400 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది.

Read Also: ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్.. ఆ ప్లైట్స్ కూడా వచ్చేస్తున్నాయ్!

Tags

Related News

రైళ్లలో ఏఐ సర్వేలెన్స్.. ఇక వారికి చుక్కలే!

ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్.. ఆ ప్లైట్స్ కూడా వచ్చేస్తున్నాయ్!

కేరళ To ఉత్తరాఖండ్.. ఆగస్టులో చూడాల్సిన 10 అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

ఈ లోకో పైలెట్ ఎర్రబస్సు డ్రైవర్ లా ఉన్నాడే.. చెయ్యొత్తగానే రైలు ఆపాడు!

ప్రకృతి అందాల నడుమ వందేభారత్‌ పరుగులు.. ట్రయల్ రన్ కు రైల్వే గ్రీన్ సిగ్నల్!

టూర్ వెళ్లాలని ఉంది కానీ బడ్జెట్ తక్కువగా ఉందా? దేశంలో బెస్ట్ ఆప్షన్స్ ఇవిగో

కొత్త గ్లామర్‌తో మెరిసిపోతున్న బొగత జలపాతం.. మురిసిపోతున్న పర్యాటకులు!

Big Stories

Advertisement
×