E-Paper
Advertisement

ట్రావెలింగ్‌లో మీ ఫోన్ హ్యాక్ అవ్వకూడదంటే.. ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఈ రూల్ పాటించండి!

ట్రావెలింగ్‌లో మీ ఫోన్ హ్యాక్ అవ్వకూడదంటే.. ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఈ రూల్ పాటించండి!
Advertisement

Public WiFi Risks: ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎయిర్‌పోర్టులు, హోటళ్లు లేదా కేఫ్‌లలో దొరికే ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌లను వాడటం మనకు చాలా అలవాటు. మొబైల్ డేటా ఆదా అవుతుంది, నెట్ స్పీడ్‌గా వస్తుందని వెంటనే కనెక్ట్ అయిపోతాం. కానీ, ఈ చిన్న సదుపాయం వెనుక ఎంతటి పెద్ద ప్రమాదం దాగుందో చాలామంది గమనించరు. ఒక చిన్న పొరపాటు వల్ల మన వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

తెలియని నెట్‌వర్క్‌తో పెద్ద ముప్పు:

పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను మనతో పాటు ఎంతోమంది కొత్తవాళ్లు వాడుతుంటారు. సెక్యూరిటీ సరిగ్గా లేని ఈ నెట్‌వర్క్‌లలో ఎవరు కనెక్ట్ అయ్యారో తెలుసుకోవడం అసాధ్యం. సరిగ్గా ఇదే పరిస్థితిని సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటారు. మనం లాగిన్ అయ్యే సమయాన్ని ఆసరాగా చేసుకుని మన పరికరాల్లోకి హ్యాకర్లు సులువుగా ప్రవేశిస్తారు.

అనుమానాస్పద లాగిన్ పేజీలు:

Advertisement

వైఫై కనెక్ట్ చేసే సమయంలో తరచూ మన ఈ-మెయిల్ అడగడం లేదా నిబంధనలు అంగీకరించమని పేజీలు రావడం చూస్తుంటాం. వీటిలో కొన్ని నకిలీవి కూడా ఉండే ఛాన్స్ ఉంది. మీ సిస్టమ్ అప్‌డేట్ చేయాలనో, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేయాలనో స్క్రీన్‌పై పాప్‌అప్‌లు వస్తే వాటిని అస్సలు నమ్మకండి. అలాంటి లింక్‌లు క్లిక్ చేస్తే మీ వివరాలు నేరుగా దొంగల చేతికి వెళ్లినట్టే.

Also Read: టెన్షన్ లేని లైఫ్‌స్టైల్ కోసం యాపిల్ బిగ్ ప్లాన్.. వర్కౌట్ లవర్స్‌కి ది బెస్ట్ ఆప్షన్!

ఏమేం చోరీకి గురవుతాయి?

Advertisement

ఒక్కసారి హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ మన డివైజ్‌లోకి వచ్చిందంటే మన పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలు, కుకీస్, ల్యాప్‌టాప్‌లోని ముఖ్యమైన ఫైల్స్ అన్నీ చోరీకి గురవుతాయి. కొన్ని రకాల వైరస్‌లు అయితే మనకు తెలియకుండానే స్క్రీన్‌షాట్లు తీయడం, ఆడియో, వీడియో రికార్డ్ చేయడం కూడా చేస్తాయి. ముఖ్యంగా ఆఫీస్ పనుల కోసం ప్రయాణాలు చేసేవారికి ఇది మరింత ప్రమాదకరం.

సురక్షితంగా ఉండాలంటే:

ఫ్రీ వైఫై వాడాల్సి వచ్చినప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చు. ముఖ్యమైన లేదా ఆఫీస్ పనులు ఉన్నప్పుడు పబ్లిక్ వైఫైకి బదులుగా మీ సొంత మొబైల్ హాట్‌స్పాట్ లేదా ఈ-సిమ్ వాడటం చాలా మంచిది. వైఫై నెట్‌వర్క్ పేరు నిజమైనదో కాదో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నాకే కనెక్ట్ అవ్వాలి.

అప్రమత్తతే అసలైన రక్షణ:

ఏదైనా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలనుకుంటే డివైజ్ అఫీషియల్ సెటింగ్స్ నుంచే చేయాలి కానీ, ఉచిత వైఫై లాగిన్ పేజీల్లో వచ్చే నోటిఫికేషన్లను బ్లైండ్‌గా నమ్మకూడదు. ప్రయాణాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉంటూ, అనుమానాస్పద లింక్‌లకు దూరంగా ఉంటే మన వ్యక్తిగత, ఆఫీస్ డేటాను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

Also Read: టెన్సర్ జీ6 ప్రాసెసర్‌తో Pixel 11 Pro XL.. ఊహించని షాక్ ఇచ్చిన గీక్‌బెంచ్ స్కోర్లు!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×